ఉల్లి చేసే మేలు..!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు... ఉల్లిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మరి.. అవేంటో తెలుసుకుందామా..!

Updated : 20 Feb 2024 04:40 IST

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు... ఉల్లిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి మరి.. అవేంటో తెలుసుకుందామా..!

చక్కెర స్థాయి నియంత్రణ.. మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో మంచిది. ఎందుకంటే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచే రసాయనాలు ఇందులో ఉన్నాయి. దీనిలో తక్కువ కొవ్వులు, పీచు పదార్థాలు మెండుగా ఉండి బరువు పెరగకుండా చేస్తాయి.

చర్మ ఆరోగ్యానికి.. ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని త్వరగా రానివ్వవు. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఉండే సల్ఫర్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నలభైల్లో వచ్చే ఎముకలు బోలువారడాన్ని తగ్గిస్తాయి. దీనిలోని ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు దీర్ఘకాలిక అనారోగ్యాలను అదుపులో ఉంచుతాయి. సల్ఫర్‌ రక్తపోటునూ, చెడుకొవ్వులనూ తగ్గిస్తుంది. గుండెజబ్బులను రానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే  విటమిన్‌-సి ఇన్‌ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

క్యాన్సర్‌ నియంత్రణ.. దీనిలోని సల్ఫర్‌, యాంటీ ఆక్సిడెంట్లూ క్యాన్సర్‌ కణాలు ఏర్పడకుండా సాయపడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు అలర్జీలను దూరం చేసి, ఆర్థరైటిస్‌ దరిచేరకుండా కాపాడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్