ఇవి తినొద్దు సుమీ!

ఇంటిల్లిపాదినీ చక్కబెట్టే మన ఆడాళ్లు ఏం తింటారో, ఎప్పుడు తింటారో తెలియదు. అలా ఎక్కువ కాలం వేళాపాళా లేకుండా తినడం, అసలు తినకపోవడం వంటివన్నీ... తరవాత జంక్‌ఫుడ్‌ మీదకు మనసు మళ్లేలా చేస్తాయి.

Updated : 25 Feb 2024 03:36 IST

ఇంటిల్లిపాదినీ చక్కబెట్టే మన ఆడాళ్లు ఏం తింటారో, ఎప్పుడు తింటారో తెలియదు. అలా ఎక్కువ కాలం వేళాపాళా లేకుండా తినడం, అసలు తినకపోవడం వంటివన్నీ... తరవాత జంక్‌ఫుడ్‌ మీదకు మనసు మళ్లేలా చేస్తాయి. ఫలితంగానే అజీర్తి, మలబద్ధకం, గ్యాస్‌, బరువుపెరగడం వంటి సమస్యలన్నీ... మరి అలాకాకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు.

  • కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇతర ఆహారాలతో పోలిస్తే కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వినియోగించే కొవ్వు రకాన్ని బట్టి, అవి అరిగే సమయం మారుతుంది. అధిక కొవ్వు పదార్థాలు గ్యాస్‌, ఉబ్బరం, మలబద్ధకాలకి కారణమవుతాయి. వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిది. నట్స్‌, సీడ్స్‌, గుడ్లు, బీన్స్‌, చేపలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు దొరికే పదార్థాలను తీసుకోండి.
  • కారంగా, ఘాటుగా ఉన్న పదార్థాలు రుచికి భలే ఉంటాయి. కానీ, అతిగా తింటే జీర్ణాశయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి పొట్ట, పేగు లైనింగ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా డయేరియా, కడుపులో మంట, నొప్పి వంటి ఇబ్బందులను ఎదుర్కోవాలి.  అతి ఏదైనా సమస్యే అని గుర్తుంచుకోవాలి.
  • స్వీట్లూ, కృత్రిమ స్వీటెనర్లు ఉన్న పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదు. ఇందులో చక్కెరతో పాటు కెలొరీల మోతాదూ ఎక్కువే. ఇవి పేగుల్లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫలితంగా గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసమస్యలు రావచ్చు.
  • బేకరీ ఐటెమ్స్‌ ప్రాసెస్‌ చేసిన పిండితోనే ఎక్కువగా చేస్తారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్టాల్ర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి.. ఇవి పేగుల వాపునకు కారణమవుతాయి. బరువు పెరగడంతో పాటు టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్క్‌నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. బదులుగా చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, పండ్ల ముక్కలు వంటివాటిని తీసుకోవచ్చు. ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు బరువూ, వాటి వల్ల వచ్చే ఇతరత్రా సమస్యల్నీ తగ్గిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్