మెంతితో మేలెంతో

మన కూరల్లో వాడే మెంతులు ఎంత మేలు చేస్తాయో, మెంతి ఆకులను తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యం అంతే మెరుగుపడుతుంది.

Updated : 28 Feb 2024 05:28 IST

మన కూరల్లో వాడే మెంతులు ఎంత మేలు చేస్తాయో, మెంతి ఆకులను తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యం అంతే మెరుగుపడుతుంది.

  • మెంతి ఆకుల్లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. కానీ శరీర ద్రవాల్లో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా, గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటాసిడ్‌లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో కూరలే కాకుండా స్మూతీలు వంటివీ చేసుకుని తీసుకోవచ్చు.
  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి, బీటా కెరొటిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడుకొవ్వులతో పోరాడి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా శరీరంలోని టాలరెన్స్‌ని పెంచడం ద్వారా ఇన్సులిన్‌ పనితీరు మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఈ ఆకు కూర కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుందంటున్నాయి పలు అధ్యయనాలు.
  • పగుళ్లు, గాయాల నుంచి ఎముకలు కోలుకోవాల్సి వచ్చినప్పుడు కీలకంగా పనిచేసే విటమిన్‌ కె, కాల్షియంలు... మెంతి ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజువారీ డైట్‌లో తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉండటంతో పాటు భవిష్యత్తులో ఆస్టియో పోరోసిస్‌ ముప్పు దరిచేరకుండా సమర్థంగా ఎదుర్కోవచ్చు.
  • బాలింతల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే గుణాలు మెంతి కూరలో ఎక్కువగా ఉంటాయని చెబుతోంది ఆయుర్వేద శాస్త్రం. అందుకే ప్రసవానంతరం బిడ్డకు సరిపడ పాలు పడనప్పుడు రోజూ కప్పు మెంతికూరను అన్నంతో నైనా, చపాతీలో కలిపి తిన్నా, పొడిలా వాడినా మేలు చేస్తుందట.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్