తేలిగ్గా తీసుకోవద్దు!

పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, అనారోగ్యం, నిరాశ...కారణాలేవైనా కుంగుబాటు బారిన పడుతోన్న మహిళల శాతం ఏటికేడు పెరుగుతోందంటున్నాయి పలు అధ్యయనాలు.

Published : 28 Mar 2024 01:57 IST

ని ఒత్తిడి, కుటుంబ కలహాలు, అనారోగ్యం, నిరాశ...కారణాలేవైనా కుంగుబాటు బారిన పడుతోన్న మహిళల శాతం ఏటికేడు పెరుగుతోందంటున్నాయి పలు అధ్యయనాలు. ఇవి శారరీకంగానూ అనారోగ్యాలకు కారణమవుతున్నాయట. వీటి బారిన పడకూడదంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి అంటారు నిపుణులు.

గుర్తించండి:  శరీరానికి చిన్న గాయం తగిలినా... ఆ నొప్పిని భరించలేక ఏదో రూపంలో చికిత్స అందిస్తాం. కానీ, కుంగుబాటునీ, ఆందోళననీ మాత్రం అంత త్వరగా గుర్తించలేం. బయటవారే కాదు, ఎవరికి వారూ దీన్ని గమనించుకోలేకపోవచ్చు. అందుకే ఇవి దరి చేరకూడదంటే డైట్‌లో సమతులాహారం ఉండాలి.  ఇంకా... జాగింగ్‌, రన్నింగ్‌, వాకింగ్‌, యోగా, డ్యాన్స్‌, సైక్లింగ్‌... ఇలా ఏ వ్యాయామాన్ని ఎంచుకున్నా కనీసం అరగంట నుంచి గంటపాటు చేయగలగాలి. ఇవి ఒంట్లో హ్యాపీ హార్మోన్లను విడుదల చేసి... శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచుతాయి.

సంకోచించొద్దు: ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనదే. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకునే బదులు, మిమ్మల్ని మీరు అంగీకరించండి. మీరు ఇష్టపడింది చేయండి. సౌకర్యవంతంగా ఉండండి. మీకు ఏది ఉత్తమమనిపిస్తే దానిపై దృష్టి పెట్టండి. ఎప్పుడైనా అనవసర ఆందోళనలూ, ఒత్తిడీ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంటేే... తేలిగ్గా తీసుకోవద్దు. వీటినీ అనారోగ్యాలుగానే భావించి చికిత్స తీసుకోండి. అప్పుడు మీపై మీరు దృష్టిపెట్టడానికి దారులు కనిపిస్తాయి. ఒత్తిడిని అదుపులో ఉంచుకునే మార్గాలు అర్థమవుతాయి.

వ్యాపకాలు పెంచుకోండి... శారీరకంగా, మానసికంగా అతిగా శ్రమిస్తే మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయనుకోవద్దు. ఈ తీరు కొన్నిసార్లు మిమ్మల్ని మరింత కుంగుబాటుకి గురిచేయొచ్చు. ఒత్తిడినీ, మనోవ్యాకులతనూ తగ్గించుకోవాలన్నా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా... ఆటలు, అభిరుచులపై దృష్టిపెట్టండి. ఇవి మీ దృష్టిని మరలుస్తాయి. సాంత్వన అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్