గుడ్డుకి బదులుగా..!

చాలామంది చిన్నారులు గుడ్డు తినడానికి మారాం చేస్తుంటారు. ఆరోగ్యానికి మంచిది కదా అని బలవంతంగా తినిపిస్తే దానిమీద అయిష్టతను పెంచుకునే అవకాశం ఉంది. అందుకే పోషకాలందించే ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 29 Mar 2024 02:16 IST

చాలామంది చిన్నారులు గుడ్డు తినడానికి మారాం చేస్తుంటారు. ఆరోగ్యానికి మంచిది కదా అని బలవంతంగా తినిపిస్తే దానిమీద అయిష్టతను పెంచుకునే అవకాశం ఉంది. అందుకే పోషకాలందించే ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి.

బఠాణీ.. పోషకాలు మెండుగా, అందరికీ అందుబాటులో ఉండే వీటిని చిన్నారులూ, శాకాహారులూ గుడ్డుకి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఇనుము ఎర్రరక్త కణాలను వృద్ధి చేయడంలో సాయపడుతుంది. గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అంతేకాదు, మెగ్నీషియం, విటమిన్‌-బి, సి వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి.

స్వీట్‌కార్న్‌.. ఇందులోని మెగ్నీషియం ఎముకలను దృఢపరుస్తుంది. పొటాషియం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చి అలసటను దూరం చేస్తుంది. దీంతోపాటు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే చిట్టి బొజ్జలకు వీటిని ఉడికించి చిరుతిండిగా పెడితే ఎంచక్కా తినేస్తారు. విటమిన్‌-సి ఎక్కువగా ఉండటంవల్ల చిన్నారుల్లో వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది.

వేరుశనగ.. దీంట్లో ప్రొటీన్‌ ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. భోజనం తరవాత గ్లూకోజ్‌ వేగంగా పెరగకుండా చేస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికీ ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం వల్ల చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బ్రాకలీ... ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. చిన్నారులు గుడ్డును ఇష్టపడకపోతే వీటిని రుచిగా వండిపెట్టండి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. దీనిలోని కెరోటినాయిడ్స్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. బీటా- కెరోటినాయిడ్లు శరీరంలో విటమిన్‌-ఎ గా మారి కంటి ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్