కాబోయే అమ్మలకి... వీరభద్రాసనం..!

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తీ శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. అందులోనూ గర్భిణుల్లో ఒత్తిడి, ఆందోళన కాస్త ఎక్కువగా ఉంటాయి.

Published : 30 Mar 2024 01:45 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తీ శారీరక, మానసిక సవాళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. అందులోనూ గర్భిణుల్లో ఒత్తిడి, ఆందోళన కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటిని అధిగమించడానికి ఈ వీరభద్రాసనం బాగా ఉపయోగపడుతుంది.

చేసే విధానం.. ఈ ఆసనాన్ని మొదటినెల నుంచే చేయవచ్చు. అలవాటయ్యే వరకూ గోడ లేదా కర్ర ఊతంతో చేయాలి. తరవాత ఊతం లేకుండా చేసేందుకు ప్రయత్నించాలి. ఇది నిలబడి చేసే ఆసనం కాబట్టి ఫొటోలో చూపించిన విధంగా కుడిపాదాన్నీ, మోకాలునీ కుడివైపునకు తిప్పి నెమ్మదిగా వంచాలి. ఎడమకాలుని అదే స్థానంలో ఉంచి వీలైనంత వరకు చాపాలి. రెండు చేతులనూ భుజాలకు సమానంగా పెట్టాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయాలి. ఈ ఆసనంలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి, యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రోజూ కుడివైపూ, ఎడమవైపూ రెండుసార్లు చొప్పున చేయడం వల్ల గర్భిణుల్లో కటి భాగానికి బలం చేకూరుతుంది. ప్రసవానంతరం శరీరం వదులు కాకుండా ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కాళ్ల నొప్పి, లాగడం వంటి సమస్యలు తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్