చలవ చేసే మునగ...

రుతువులు, కాలాలకు అనుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా..! అందుకే ఎండాకాలంలో మునక్కాయ, మునగాకు పొడిని తప్పక తినాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయం అవుతాయట.

Published : 01 Apr 2024 01:32 IST

రుతువులు, కాలాలకు అనుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా..! అందుకే ఎండాకాలంలో మునక్కాయ, మునగాకు పొడిని తప్పక తినాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయం అవుతాయట.

పోషకాలు.. వీటిలో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్‌లు ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వీటిలో పీచు అధికంగా ఉండటంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలూ తగ్గుతాయి.

చర్మ సమస్యలు.. మునగలోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్‌ యాసిడ్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆర్థరైటిస్‌, అలర్జీలు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాదు,  నీటిశాతం ఎక్కువగా ఉండటంవల్ల శరీరాన్ని డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతుంది. అలసట, వడదెబ్బ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. వీటిని సూప్‌ లేదా, కూరల రూపంలో తీసుకుంటే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్