మహిళలకు మేలు చేసే పిలాటీస్‌

పిలాటీస్‌... శరీరంతో పాటు మనసూ దృఢంగా ఉండేందుకు రూపొందించిన ఓ రకమైన వ్యాయామ పద్ధతి.  తక్కువ ప్రభావంతోనే మెరుగైన ఫలితాలను అందించే వీటిని ఎంచుకోవడానికి మహిళలు ఆసక్తి చూపించడంతో ఇది సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యింది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దామా!

Published : 01 Apr 2024 01:35 IST

పిలాటీస్‌... శరీరంతో పాటు మనసూ దృఢంగా ఉండేందుకు రూపొందించిన ఓ రకమైన వ్యాయామ పద్ధతి.  తక్కువ ప్రభావంతోనే మెరుగైన ఫలితాలను అందించే వీటిని ఎంచుకోవడానికి మహిళలు ఆసక్తి చూపించడంతో ఇది సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యింది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దామా!

  • ‘పింక్‌ పిలాటీస్‌ ప్రిన్సెస్‌’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది ఈ వ్యాయామ ట్రెండ్‌.  గులాబీ రంగు అథ్లెటిక్‌ దుస్తులు ధరించిన మహిళలు వీటిని సాధన చేస్తూ... శారీరకంగా మానసికంగా ఎంత సంతోషంగా ఉండొచ్చో చెబుతున్నారు. యోగాసనాలకు కాస్త దగ్గరగా ఉండే వీటిని సుమారు యాభై రకాలకుపైగానే చేయొచ్చట. ఎవరి శారీరక అవసరాలకు తగ్గట్లు వాళ్లు ఎంచుకుని చేయడం వల్ల ఫిట్‌నెస్‌ గోల్స్‌ని త్వరగా చేరుకోవచ్చు.
  • పిలాటీస్‌ని లో ఇంటెన్సిటీతో చేస్తూనే... ఎక్కువ స్ట్రెంత్‌నీ, ఫ్లెక్సిబిలిటీనీ మెరుగుపరుచుకోవచ్చు. సాధారణంగా పడుకుని చేసే ఈ కసరత్తుల వల్ల రక్తప్రసరణలో లోపాలు సరి అవుతాయి. శరీరాకృతినీ సరిదిద్దుకోవచ్చు. పైగా వీటిని ఇంట్లోనే సాధన చేసే వీలుండటం, సులువుగా చేయగలగడంతో... వేగంగా బరువు తగ్గొచ్చు. పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌, ఎండోమెట్రియాసిస్‌ వంటి సమస్యల్ని అదుపులో ఉంచుకోవచ్చు.
  • కండరాలకు ఉపశమనం. ఇంకా మానసిక దృఢత్వాన్ని, కోర్‌ స్ట్రెంత్‌ని పెంచుతుంది. దీన్ని మహిళలెందుకు ఎక్కువగా ఎంచుకుంటారంటే ఈ వ్యాయామాల వల్ల కండరాల పరిమాణం పెరగకుండా వాటి బలం పెరుగుతుంది. గాయాలయ్యే ప్రమాదమూ తక్కువ. అంతేకాదు మహిళల్లో ఎక్కువగా కనిపించే మూత్రాశయ ఇబ్బందుల్ని ఈ పిలాటిస్‌ తగ్గిస్తుంది. యోని కండరాల బలోపేతానికి, ప్రసవానంతర సమస్యల నివారణకు ఈ కసరత్తులు ఉపయోగపడతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్