సర్జరీ ముందు వీటిని తింటున్నారా...

మనలో చాలామందికి చాక్లెట్లూ, బిస్కెట్లూ, ఐస్‌క్రీములూ, మాంసాహారం, వేపుళ్లలాంటివి తినడం అలవాటే. రోజూ ఆహారంలో ఇవే ఉండాలి... అని పట్టుబట్టే వాళ్లూ ఉంటారు.  

Published : 02 Apr 2024 01:48 IST

నలో చాలామందికి చాక్లెట్లూ, బిస్కెట్లూ, ఐస్‌క్రీములూ, మాంసాహారం, వేపుళ్లలాంటివి తినడం అలవాటే. రోజూ ఆహారంలో ఇవే ఉండాలి... అని పట్టుబట్టే వాళ్లూ ఉంటారు.  అలాంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇవి మామూలుగా తినడమే అనారోగ్యం... అటువంటిది ఏదైనా సర్జరీ చేయించుకునే ముందు రోజుల్లో అసలు తినకూడదని ఒహాయో యూనివర్సిటీ చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో ఉండే అధిక కొవ్వులు మెదడులో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసి, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తెస్తాయట. పెద్దవారిలో మాత్రమే కాదు, యువతలోనూ ఈ ప్రభావం ఉంటుందట. అధిక కొవ్వు గల ఆహారం తీసుకుంటే సహజంగానే మన మెదడులో కొంత ఇన్‌ఫ్లమేషన్‌ మొదలవుతుంది. అటువంటిది సర్జరీ చేయించుకునే ముందు ఇటువంటివి తీసుకుంటే జ్ఞాపకశక్తి సమస్యలు దీర్ఘకాలంపాటు మనల్ని వెంటాడే అవకాశం ఉందట. కాబట్టి  సర్జరీ ముందు డీహెచ్‌ఏ ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్‌ సప్లిమెంట్లు లేదా ఇది అధికంగా ఉండే వాల్‌నట్స్‌, పాలకూర, అవిశెగింజలూ, బీన్స్‌, బెర్రీలు, ఆరెంజ్‌, బొప్పాయి... వంటివి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్