కీళ్లవాతంతో... సంతాన సమస్యలా!

అమ్మ...  పిలుపులోని మధురానుభూతిని పొందాలని కోరుకోని అమ్మాయి ఉండదేమో. అయితే ఈ తరానికి మాత్రం ఆ పిలుపు అంత తేలిగ్గా దక్కడం లేదు. మారుతోన్న జీవనశైలికి తగ్గట్లూ, సవాళ్లెన్నో పలకరిస్తున్నాయి. తాజాగా రుమటాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనమూ అందుకు ఊతమిస్తోంది.

Published : 03 Apr 2024 01:49 IST

అమ్మ...  పిలుపులోని మధురానుభూతిని పొందాలని కోరుకోని అమ్మాయి ఉండదేమో. అయితే ఈ తరానికి మాత్రం ఆ పిలుపు అంత తేలిగ్గా దక్కడం లేదు. మారుతోన్న జీవనశైలికి తగ్గట్లూ, సవాళ్లెన్నో పలకరిస్తున్నాయి. తాజాగా రుమటాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనమూ అందుకు ఊతమిస్తోంది. కీళ్లవ్యాధితో బాధపడే వారు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. సంతానలేమి, నెలలు నిండక ముందే బిడ్డ పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం,  సిజేరియన్లు,  పిల్లల్ని ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచాల్సి రావడం... వంటి సమస్యలు అధికమవుతున్నాయట. ఫిన్నిష్‌ నేషన్‌వైడ్‌ రిజిస్టర్స్‌ డేటా ఆధారంగా ఈ విషయాలు వెల్లడించారు. ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌... అంటే శరీరంలోని రోగ నిరోధకవ్యవస్థ మన శరీర కణజాలాలు, అవయవాలపైనే దాడిచేసే స్థితి. ఈ రకమైన వ్యాధుల్లో కీళ్లవాతమూ ఒకటి. ప్రత్యుత్పత్తి దశలో చాలామంది ఆటోఇమ్యూన్‌ వ్యాధుల బారిన పడినట్లు ఫిన్లాండ్‌లో 20ఏళ్లపాటు చేసిన పరిశోధనలో తేలింది. అందుకే ఈ వ్యాధి ఉన్న మహిళలు గర్భధారణ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలనీ, వైద్యులను సంప్రదిస్తూ సరైన మందులు వాడాలనీ నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్