మనసు పెట్టి తింటున్నారా..!

మారిన జీవన శైలి, పని విధానాల వల్ల భోజనం చేసే వేళలు మారిపోతున్నాయి. దాంతోపాటు హడావుడిగానూ తినాల్సి వస్తోంది. ఈ అలవాటుతో అనారోగ్యాలు వచ్చే ముప్పు పెరుగుతోందట. అందుకే మనసు పెట్టి తినమంటున్నారు నిపుణులు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నాయి అధ్యయనాలు.

Published : 03 Apr 2024 05:57 IST

మారిన జీవన శైలి, పని విధానాల వల్ల భోజనం చేసే వేళలు మారిపోతున్నాయి. దాంతోపాటు హడావుడిగానూ తినాల్సి వస్తోంది. ఈ అలవాటుతో అనారోగ్యాలు వచ్చే ముప్పు పెరుగుతోందట. అందుకే మనసు పెట్టి తినమంటున్నారు నిపుణులు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నాయి అధ్యయనాలు.

  • కొందరికి తినే ఆహారం మీద నియంత్రణ ఉండదు. ఇంకొందరేమో బాగా ఆకలి వేస్తుందనో, నచ్చిన కూర అనో ఓ రెండు ముద్దలు ఎక్కువ తినేస్తుంటారు. ఇలాంటివారు మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌ విధానాన్ని అనుసరిస్తే సరి. ఆకలిని సరిగా గుర్తించి తినగలుగుతారు. దీంతో బరువు పెరుగుతారన్న భయమూ అక్కర్లేదు.
  • ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలియకుండానే  ఎక్కువ ఆహారాన్ని తినేస్తుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా అతిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటప్పుడు వ్యాయామాలు చేయడంతో పాటు మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌నీ పాటిస్తే కార్టిసాల్‌ హార్మోన్ల స్థాయులు అదుపులో ఉంటాయంటారు నిపుణులు.
  • భోజన సమయంలో పరధ్యానంలో ఉండకూడదు, సెల్‌ఫోన్లూ, టీవీలకూ దూరంగా ఉండాలి. తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడంవల్ల శరీర ఇంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్