నిమ్మ చెక్కని ఇలా కూడా వాడొచ్చు!

నిమ్మలో ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మరి దీన్ని మరికొన్ని ఇంటి పనులు సులువుగా అయ్యేందుకూ వాడొచ్చని తెలుసా? అదెలాగో తెలుసుకుందాం రండి.

Published : 04 Apr 2024 01:40 IST

నిమ్మలో ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మరి దీన్ని మరికొన్ని ఇంటి పనులు సులువుగా అయ్యేందుకూ వాడొచ్చని తెలుసా? అదెలాగో తెలుసుకుందాం రండి.

  • దుప్పట్లు ఉతికేటప్పుడు నీళ్లలో ఒక నిమ్మచెక్క, అర చెంచా వంటసోడా వేసి నానబెట్టి ఉతికితే తెల్లగా మెరుస్తాయి. అలాగే నిమ్మ చెక్కతో మరకలు ఉన్న చోట రుద్దినా చక్కగా పోతాయి.
  • అరటి, వంకాయ, బీట్‌రూట్‌ వంటి కూరగాయలు కోసినప్పుడు చేతులు నల్లగా మారతాయి. అప్పుడు నిమ్మచెక్కతో రుద్దితే సరి. జిడ్డు త్వరగా వదులుతుంది.
  • ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే.. వాటి దగ్గర కాస్త నిమ్మరసాన్ని చల్లండి. వెంటనే పారిపోతాయి.
  • ఫ్రిజ్‌లో ఎక్కువ ఆహారపదార్థాలు సర్దినప్పుడు వాటి తాలూకు వాసనలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు అరచెక్క నిమ్మకాయపై కాస్త బేకింగ్‌ సోడా చల్లి లోపల ఉంచితే అవి దూరమవుతాయి.
  • గులాబీ, చామంతి, గోవర్ధన, టొమాటో, పాలకూర వంటి మొక్కలు ఆమ్లతత్వం ఎక్కువగా ఉన్న నేలల్లో బాగా పెరుగుతాయి. ఇందుకోసం వాడేసిన నిమ్మ తొక్కల్ని మెత్తగా నూరి మట్టిలో కలిపితే సరి. చక్కగా ఎదుగుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్