జంటగా వ్యాయామం చేస్తే...

వ్యాయామం శరీరాన్ని ఫిట్గ్‌ా ఉంచడమే కాదు మానసిక ఆరోగ్యాన్నీ అందిస్తుంది. అదే భాగస్వామితో కలిసి వ్యాయామం చేస్తే ఆ బంధానికి బోలెడు ప్రయోజనాలు కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 04 Apr 2024 01:49 IST

వ్యాయామం శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాదు మానసిక ఆరోగ్యాన్నీ అందిస్తుంది. అదే భాగస్వామితో కలిసి వ్యాయామం చేస్తే ఆ బంధానికి బోలెడు ప్రయోజనాలు కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దామా...

భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అన్ని విషయాలు పంచుకోగలుగుతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇద్దరూ కలిసి చేయడం వల్ల ఆనందాన్ని కలిగించే హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యంగా ఉంటారు.

రోజువారీ షెడ్యూల్‌లో ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు తక్కువగా ఉండడం వల్ల అది ఇరువురి మధ్య మనస్పర్థలకు కారణం కావచ్చు. అదే వ్యాయామం కలిసి చేయటం వల్ల ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకున్నట్లూ ఉంటుందీ... ఇద్దరి మధ్య ప్రేమా పెరుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా కలిసి వ్యాయామం చేయడం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.

అమెరికన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ అసోసియేషన్‌ ప్రకారం, కలిసి పనిచేసే జంటలు మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారట. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ప్రమాదాలూ తక్కువగా కనిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్