మళ్లీ ఆ నూనెను వాడొద్దు...

సాధారణంగా ఇంట్లో పిండివంటలూ, పూరీలూ చేసేటప్పుడు ఎక్కువగా నూనె మిగిలిపోతుంటుంది. దాన్ని మళ్లీ వేరే వంటల్లో వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 08 Apr 2024 02:22 IST

సాధారణంగా ఇంట్లో పిండివంటలూ, పూరీలూ చేసేటప్పుడు ఎక్కువగా నూనె మిగిలిపోతుంటుంది. దాన్ని మళ్లీ వేరే వంటల్లో వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చు అంటున్నారు నిపుణులు...

ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడటం వల్ల హానికరపదార్థాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ పెరిగేలా చేస్తాయి. అంతేకాదు, రోగనిరోధక శక్తిని తగ్గించి, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. వీటివల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదమూ ఉంది.

  • నూనెను వృథాగా పడేయటం ఇష్టం లేదా? అయితే ఇంట్లో ఉన్న ఇనుప వస్తువులు, చెక్క ఫర్నిచర్‌లకు రాస్తే సరి. తుప్పు పట్టడం, పాడవడం లాంటి సమస్యలుండవు. పైగా మెరుస్తాయి.
  • అప్పడాలు వేయించేందుకు నూనె ఎక్కువగా పోస్తాం. తీరా పూర్తయ్యేసరికి నూనె అడుగున మడ్డి పేరుకుపోతుంది. దాన్ని మరలా వంటల్లో వాడటం వల్ల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈసారి నుంచి చిన్న కడాయిలో వేయించండి. నూనె ఎక్కువగా వృథా అవ్వకుండా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్