ఈదడానికి సిగ్గెందుకు?

చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు... ఊరు చివరి వాగుల్లోనో, చిన్న చిన్న నదులూ, సెలయేర్లలోనో స్నేహితులతో కలిసి ఈత కొడుతూ సమయం గడిపేవాళ్లం కదా. ఎప్పటికీ ఆ క్షణాలు గుర్తుండిపోతాయి.

Published : 11 Apr 2024 05:45 IST

చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు... ఊరు చివరి వాగుల్లోనో, చిన్న చిన్న నదులూ, సెలయేర్లలోనో స్నేహితులతో కలిసి ఈత కొడుతూ సమయం గడిపేవాళ్లం కదా. ఎప్పటికీ ఆ క్షణాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడేమో అలా బయట ఈత కొట్టాలంటే నామోషీ పడే అమ్మాయిలే ఎక్కువ. కానీ ఈత కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా! పూల్‌లో మునగగానే ఆ చల్లటి నీళ్లు మన శరీరాన్ని ఆత్మబంధువులా ఆలింగనం చేసుకుంటాయి. శీతల గాలులు...  ఒత్తిళ్ల నుంచి మనకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నీళ్లలో తేలుతున్నప్పుడు ఆందోళనలన్నీ మన నుంచి దూరంగా కొట్టుకుపోయి, మనసు తేలికపడినట్లు అనిపిస్తుంది. నెమ్మదిగా తాకే ఆ నీటి అలలు మనసుకి ఓదార్పుని ఇస్తాయి. ఈతవల్ల శరీరం, మనసూ ఉత్తేజితమవడమే కాదు గుండె ఆరోగ్యమూ మెరుగవుతుంది. కండరాల బలం, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అందుకే ఈ వేసవిలో అలా నాలుగు గోడలకే పరిమితమవకుండా మన అపార్ట్‌మెంట్‌ స్విమ్మింగ్‌పూల్‌లోనైనా లేదా మీకు దగ్గర్లో ఏదైనా చిన్న నదిలాంటివి ఉంటే అందులో అయినా ఈత కొట్టడానికి సంకోచించకండి. సరదాగా స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో కలిసి వెళ్లినా సరే. ఆనందంతోపాటు నవ్వులూ పూస్తాయి. మరి ఇంకేం సరదాగా ఈత కొట్టేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్