ఇది కూడా వ్యాయామమే...

సమయాభావంతో కొందరు జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయలేకపోతుంటారు. అయితే ఇంట్లోనే జిమ్‌లాంటి వ్యాయామాలు చేసుకోవచ్చు. అదెలా అంటారా.

Published : 11 Apr 2024 01:49 IST

సమయాభావంతో కొందరు జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయలేకపోతుంటారు. అయితే ఇంట్లోనే జిమ్‌లాంటి వ్యాయామాలు చేసుకోవచ్చు. అదెలా అంటారా...

  • ఆఫీసుల్లో అపార్టుమెంటుల్లో మెట్లు ఉన్నా లిఫ్ట్‌ సౌకర్యంగా ఉంటుందని వాడుతుంటారు. అలాకాకుండా మెట్లు ఎక్కడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇదీ ఒకరకమైన వ్యాయామమే. దీనివల్ల శరీర కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు బలంగా మారతాయి.
  • శరీరాన్నీ, మెదడునీ చురుకుగా ఉంచుకోవడానికి డ్యాన్స్‌ చక్కగా ఉపయోగపడుతుంది. కాస్త సమయం తీసుకొని మీకు నచ్చిన సంగీతానికి డ్యాన్స్‌ చేయండి. ఇలా చేయడంవల్ల శరీరంలో కొవ్వు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అంతేకాదు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. డిప్రెషన్‌ నుంచి బయటపడొచ్చు.
  • రోజూ 20 నిమిషాలు స్కిప్పింగ్‌ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధమైన వ్యాయామం శరీరంలో అదనపు కెలోరీలను ఖర్చు చేసి వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది.  
  • ఇంట్లో ఉంటూ చిన్న చిన్న ఆటలు ఆడటం, సైక్లింగ్‌వంటివి ఒక వ్యాపకంగా మార్చుకోండి. ఇది కూడా వ్యాయామంలా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గించుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్