నీళ్లు తాగుతున్నారా?

వేసవిలో బయటికి అడుగుపెట్టాలంటేనే భయమేస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ నిర్జలీకరణానికి గురవుతున్నారు. మరి దాని నుంచి బయటపడాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలి.

Published : 12 Apr 2024 01:38 IST

వేసవిలో బయటికి అడుగుపెట్టాలంటేనే భయమేస్తుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ నిర్జలీకరణానికి గురవుతున్నారు. మరి దాని నుంచి బయటపడాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలి. అవేంటంటే...

నీరు మన శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం మూడు లేదా నాలుగు లీటర్ల వరకూ నీటిని తాగాలంటారు ఆరోగ్యనిపుణులు. కానీ కొందరికి పనిలో పడితే అసలు ఏమీ గుర్తుండదు. మరి దీన్ని ఎదుర్కొనడం ఎలా అంటే...  ఫోన్‌లో అలారం సెట్‌ చేసుకోవచ్చు లేదా వాటర్‌ ట్రాకింగ్‌ యాప్‌లు ఇప్పుడు చాలానే అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడినా మంచిదే. అంతేకాదు, ఆరెంజ్‌, నిమ్మ, పుదీనా, బెర్రీలు, దోసకాయ ముక్కలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టి ఆ నీటిని తాగినా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

  • పుచ్చకాయ, బెర్రీలు, బొప్పాయి, ముల్లంగి, గుమ్మడికాయ, నారింజ, ద్రాక్ష, టొమాటో, ఆకుకూరలు... ఇలా పండ్లు, కూరగాయల రూపంలోనూ శరీరానికి నీటిని అందించొచ్చు. పైగా వీటిలో ఉండే విటమిన్లు, పోషకాలు శక్తినిస్తాయి. అంతేకాదు, శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉంటాయి. వీటితో సలాడ్స్‌గా చేసుకునీ తినొచ్చు. వీటిని ఐస్‌క్రీమ్‌, సలాడ్‌ రూపాల్లో చేసి ఇస్తే పిల్లలూ ఇష్టంగా తింటారు.
  • బయటికి వెళ్లేటప్పుడు మజ్జిగ, నిమ్మరసం, చెరకురసం వంటివి వడదెబ్బ తగలకుండా చూస్తాయి. కొందరికి వేడి పానీయాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ బదులు టీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో కెఫీన్‌ తక్కువగా ఉంటుంది. అలాగే నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలను స్మూతీలుగా తీసుకోవడం వల్ల కూడా నిర్జలీకరణాన్ని నివారించొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్