మానసికారోగ్యానికి వృక్షాసనం..!

ఏకాగ్రతను పెంచడానికీ ఆల్జీమర్స్‌ని తగ్గించడానికీ మొత్తంగా నాడీవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడానికీ వృక్షాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పిల్లలూ, పెద్దలూ సులువుగా చేసే ఆసనం. ముందుగా పాదాలను దగ్గరగా ఉంచి నిలబడాలి. రెండు చేతులనూ ఇరువైపులా చాపాలి.

Updated : 13 Apr 2024 02:22 IST

ఏకాగ్రతను పెంచడానికీ ఆల్జీమర్స్‌ని తగ్గించడానికీ మొత్తంగా నాడీవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడానికీ వృక్షాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పిల్లలూ, పెద్దలూ సులువుగా చేసే ఆసనం.

ముందుగా పాదాలను దగ్గరగా ఉంచి నిలబడాలి. రెండు చేతులనూ ఇరువైపులా చాపాలి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమకాలిని కుడి మోకాలి మీదుగా తీసుకొచ్చి ఫొటోలో చూపిన మాదిరిగా ఉంచాలి. కుడిపాదం మీద బరువు నిలుపుతూ, రెండు చేతులనూ పైకెత్తి నమస్కార ముద్రను పెట్టాలి. ఈ భంగిమలో ఇరవైసెకన్లు ఉండి తిరిగి యథాస్థితికి రావాలి. కాస్త విశ్రాంతి తీసుకుని మళ్లీ కుడికాలితో ప్రయత్నించాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున ఉదయం, సాయంత్రం చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటూ సయాటికా కూడా నయం అవుతుంది. తుంటి, కటి ప్రాంతంలోని ఎముకలూ, కండరాలూ బలోపేతం అవుతాయి. ఎముకలు గుల్ల బారడాన్ని తగ్గిస్తుంది. కాళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ ఆసనంతో పాటూ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్‌, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

ఎవరు చేయకూడదు.. మైగ్రెయిన్‌, నిద్రలేమి సమస్య, రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

శిరీష, యోగ గురు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్