తోటకు నారింజ మేలు...!

విటమిన్‌-సి పండ్లు చర్మానికీ, ఆరోగ్యానికీ ఎంత మేలు చేస్తాయో మొక్కలకూ అన్ని ప్రయోజనాల్ని ఇస్తాయి. టీ, అరటి, గుడ్డు పెంకుల పొడి వంటి వాటితో ఎన్ని పోషకాలు అందుతాయో నారింజ తొక్కలతోనూ అవన్నీ లభిస్తాయి.  

Published : 14 Apr 2024 02:11 IST

విటమిన్‌-సి పండ్లు చర్మానికీ, ఆరోగ్యానికీ ఎంత మేలు చేస్తాయో మొక్కలకూ అన్ని ప్రయోజనాల్ని ఇస్తాయి. టీ, అరటి, గుడ్డు పెంకుల పొడి వంటి వాటితో ఎన్ని పోషకాలు అందుతాయో నారింజ తొక్కలతోనూ అవన్నీ లభిస్తాయి.  

  • నారింజ తొక్కల్లో నైట్రోజన్‌ పుష్కలంగా ఉంటుంది. మొక్కలకు ఇది చాలా అవసరం. అంతేకాదు ఇవి మట్టిలో త్వరగా కలిసి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. పూలూ బాగా పూస్తాయి.
  • వీటిని పొడి లేదా ద్రవరూపంలో కూడా అందించవచ్చు. నారింజ తొక్కలను కొన్నిరోజులు నానబెట్టి ఆ నీటిని మొక్క మొదట్లో పోయాలి. వీటిలోని సహజ పోషకాలు మొక్కలకు అందుతాయి. వీటినే ఎండబెట్టి పొడి చేసి మొక్కల చుట్టూ చల్లితే నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి.

  • మొక్కలు ఎండినట్లు, కుళ్లినట్లుగా కనిపిస్తే నారింజ తొక్కలను మొక్క మొదట్లో వేయాలి. ఇవి సూక్ష్మక్రిముల్ని నాశనం చేసి, మొక్కలను సంరక్షిస్తాయి.
  • వీటి నుంచి వచ్చే వాసన మొక్కలకు వచ్చే చీడపీడలను నివారిస్తుంది. అంతేకాదు చీమలు, పురుగులు వంటి వాటిని దరిచేరనీయవు. ఇందుకు ఎండిన నారింజ తొక్కలను మొక్క మొదట్లో వేయాలి.
  •  కుండీల్లో విత్తనాలు చల్లే ముందు...  నారింజ తొక్కలను ఒక పొరలావేసి తరవాతి పొరలో మట్టి వేసి ఆపై విత్తనాలు చల్లాలి. ఇది ఎరువుగా ఉపయోగపడి మొలకలు బలంగా వస్తాయి. ఇంటితోటలో నత్తలను తరిమికొట్టడానికి గుడ్డుపెంకులు, నారింజ తొక్కలను పొడి చేసి మొక్కల చుట్టూ చల్లినా సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్