చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!

ఆరోగ్యకరమైన జీవితానికి పునాది పసితనంలోనే పడుతుందంటారు. అయితే ఆ పునాదులను నిర్మించే బాధ్యత మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది.

Published : 18 Apr 2024 01:38 IST

రోగ్యకరమైన జీవితానికి పునాది పసితనంలోనే పడుతుందంటారు. అయితే ఆ పునాదులను నిర్మించే బాధ్యత మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. బయట ఎండలు మండుతున్నాయి కొంచెం తాగిస్తే ఏమవుతుందిలే అన్న భావనతో కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు కూడా కూల్‌డ్రింక్స్‌, చక్కెరలు అధికంగా ఉండే పానీయాలు వంటివి ఇస్తుంటారు. కానీ వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. బాల్యంలో చక్కెర పానీయాలు తాగిన పిల్లలు, భవిష్యత్తులో ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందని స్వాన్సీ యూనివర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది. అందుకోసం పరిశోధకులు 14వేలమంది బ్రిటిష్‌ పిల్లల ఆహారశైలిని పుట్టిన నాటి నుంచి పెద్దయ్యేవరకూ పరిశీలించారు. అందులో సోడా, కూల్‌డ్రింక్‌లు లాంటి పానీయాలు తాగే అలవాటు ఉన్న రెండేళ్లలోపు పిల్లలు 24ఏళ్లు వచ్చేసరికి ఊబకాయం బారిన పడ్డారట. కెలొరీలు, కొవ్వు, ప్రొటీన్‌, పంచదారలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. అయితే, తాజా పండ్ల రసాలను తాగిన పిల్లల్లో ఈ సమస్య లేదట. అంతేకాదు, ఇవి తాగిన పిల్లలు పెద్దయ్యాక కూడా చేపలు, పండ్లు, ఆకు కూరలు తినడం లాంటి మంచి ఆహార నియమాలు అలవరచుకుంటే, ఈ డ్రింక్స్‌ తాగిన పిల్లలు బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, మాంసం, చాక్లెెట్లు, స్వీట్లు వంటివి అధికంగా తినడానికి అలవాటు పడ్డారట. అదే క్రమంగా వారిలో అనేక అనారోగ్యాలకు హేతువైన ఊబకాయానికి దారితీసిందట. అందుకే తొలినాళ్లలోనే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు నేర్పించాలి. అవే వారి ఆరోగ్యానికి శ్రీరామరక్ష!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్