5-9... 9-5 ఈ ట్రెండేంటో తెలుసా!

పొద్దున నిద్ర లేస్తాం. పిల్లలకు స్కూల్‌ సమయం అవుతోందని హడావుడిగా టిఫిన్‌లూ, లంచ్‌ బాక్సులూ కట్టేసి, వారిని తయారుచేసి పంపించేస్తాం. ఆ తర్వాత మనం ఆఫీసుకి వెళ్లాలనే తొందరలో తినీ, తినకా బాక్సులు సర్దుకుని వెళ్లిపోతాం. రోజంతా ఆఫీసులో కష్టపడి పనిచేసి ఇంటికి వస్తాం. వచ్చీరాగానే మనకోసం ఎదురుచూసే ఇంటిపనులు ఉండనే ఉంటాయి.

Published : 19 Apr 2024 01:58 IST

పొద్దున నిద్ర లేస్తాం. పిల్లలకు స్కూల్‌ సమయం అవుతోందని హడావుడిగా టిఫిన్‌లూ, లంచ్‌ బాక్సులూ కట్టేసి, వారిని తయారుచేసి పంపించేస్తాం. ఆ తర్వాత మనం ఆఫీసుకి వెళ్లాలనే తొందరలో తినీ, తినకా బాక్సులు సర్దుకుని వెళ్లిపోతాం. రోజంతా ఆఫీసులో కష్టపడి పనిచేసి ఇంటికి వస్తాం. వచ్చీరాగానే మనకోసం ఎదురుచూసే ఇంటిపనులు ఉండనే ఉంటాయి. మరి మన ఆరోగ్యం కోసం సమయం కేటాయిస్తున్నామా? ఈ స్పృహతో వచ్చిందే ‘5-9 బిఫోర్‌ 9-5’ వెల్‌నెస్‌ ట్రెండ్‌...

దీని లక్ష్యం ఏంటంటే... మన 9-5 రొటీన్‌ మొదలవడానికంటే ముందే మనకోసం మనం కొన్ని పనులు చేసుకోవడమన్నమాట. అంటే పొద్దున్నే లేచి హడావుడిగా పరుగులు పెట్టకుండా ఉదయం 5-9 గంటల లోపు కొంత సమయం కేటాయించుకోవడమే ఈ లైఫ్‌స్టైల్‌ ఉద్దేశం. ఈ రొటీన్‌ను హ్యాష్‌ట్యాగ్‌ 5టు9 రొటీన్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

ఇందులో ఏం చేస్తారంటే...

  • త్వరగా నిద్ర లేవాలని అలారం పెట్టుకుంటాం. కానీ లేవడానికి బద్ధకించి, ఆ అలారంను ఎన్నిసార్లు ఆపుతామో కదా! కానీ ఈ లైఫ్‌స్టైల్‌ ఫాలో అయ్యేవారు 5గంటలకే తమ రోజును ప్రారంభిస్తారు.
  • ఈ బిజీ జీవితాల్లో ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఏకాగ్రత, ఆలోచనల్లో స్పష్టత వంటివి తప్పనిసరి. ఉదయాన్నే ధ్యానం చేయడం వల్ల మానసిక స్థిరత్వమూ పెరుగుతుంది. అందుకు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు వంటివి చేస్తారు.
  • సమతులాహారం తీసుకుంటేనే రోజంతా ఉత్సాహంగా ఉండగలం. అందుకే కొంత సమయం తీసుకుని అన్ని రకాల పోషకాలూ అందేలా బ్రేక్‌ఫాస్ట్‌ లాంటివి తయారు చేసుకుంటారు. ఒకవేళ బయట తినాల్సి వచ్చినా పోషకాహారం అందేలా చూసుకుంటారు.
  • సాయంత్రం కూడా 5-9 గంటల లోపు మంచి నిద్ర పట్టడానికీ, రిలాక్స్‌ అవడానికీ పుస్తకం చదవడం, వేడినీళ్ల స్నానం, తేలికపాటి వ్యాయామాలు లాంటివి చేస్తారు.

ఈ విధానంలో ఆధ్యాత్మికతా, జీవితంలో అన్నింటినీ సమన్వయ పరచుకోవాలనే ఆంతర్యమూ దాగి ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆత్మసంతృప్తి, మానసిక స్థిరత్వం కలుగుతాయి. మరి ఈ ట్రెండ్‌ను మనమూ ప్రయత్నిద్దామా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్