పురుటినొప్పులు మగవారికి కూడా..!

‘జంబలకిడి పంబ’ సినిమా చూశారా! అందులో మగవాళ్లు ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవారిగా మారిపోతారు. మహిళలు పిల్లల్ని కంటే, ఆ పురిటి నొప్పుల్ని మగవారు భరించడం తమాషాగా ఉంటుంది కదా!

Updated : 20 Apr 2024 05:12 IST

‘జంబలకిడి పంబ’ సినిమా చూశారా! అందులో మగవాళ్లు ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవారిగా మారిపోతారు. మహిళలు పిల్లల్ని కంటే, ఆ పురిటి నొప్పుల్ని మగవారు భరించడం తమాషాగా ఉంటుంది కదా! అయితే ఆ సినిమాలోలా నిజ జీవితంలోనూ మగవారిలో ప్రెగ్నెన్సీ లక్షణాలు ఉంటాయట. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో కొంతమంది భర్తల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయట. దీన్నే కూవాడ్‌ సిండ్రోమ్‌ లేదా సింపతెటిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది మగవారిలో 11నుంచి 65శాతం కనిపిస్తుందట. దీన్ని మొదటగా బ్రిటన్‌కు చెందిన ఆంత్రపాలజిస్ట్‌ ఎడ్వర్డ్‌ బర్నెట్‌ టేలర్‌ గుర్తించారు. భార్య బాగోగులు చూసుకోవడం, ఆమెతో సన్నిహితంగా ఉండడం వల్ల హార్మోనుల్లో మార్పులు జరిగి... బరువు పెరగడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, పంటినొప్పి లాంటి లక్షణాలతో పాటు కొంతమంది మగవారు పురిటి నొప్పులూ అనుభవిస్తారట. భార్య మొదటి ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు, భర్తలో ఈ లక్షణాలు కనిపించి తరవాత మాయమైపోతాయట. తిరిగి మూడో ట్రైమిస్టర్లో కనిపిస్తాయట. బిడ్డ పుట్టిన కొన్ని వారాలపాటూ ఇది కొనసాగుతుందట. అంటే అర్ధనారీశ్వరుడు భార్యకు శరీరంలో సగభాగాన్ని ఇచ్చి ప్రేమను చాటుకున్నట్లే... కొందరు మగవాళ్లు అర్ధాంగి గర్భధారణ లక్షణాలను అనుభవిస్తున్నారన్నమాట. సో, ఇప్పటికే తండ్రయిన వాళ్లూ, కాబోయే నాన్నలూ... మరి మీలో ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు కనిపించాయా?!


మీకు తెలుసా?
జాగ్రత్త మరి..!

పురుషులతో పోలిస్తే.. మహిళలకి తక్కువ చెమట పడుతుందట. ఆడవారి శరీర కణజాలంలో తక్కువ నీరు ఉన్నందువల్లే ఇలా జరుగుతుందని ఒసాకా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ తమ అధ్యయనాల ద్వారా వెల్లడించింది. అంతేకాదు వీరిలో ఉండే ఈస్ట్రోజన్‌ చెమట తక్కువ పట్టేలా చేస్తుందట. ఇది మనకు మంచిదే అనిపించినప్పటికీ, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు పురుషుల కంటే ఆడవాళ్లే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్