బిగుతు దుస్తులతో సమస్యా?

బిగుతుగా ఉండే దుస్తులు చక్కని ఆకృతినిస్తాయని మనం ఇష్టపడతాం కానీ... వాటితో అనారోగ్యాలూ ఎక్కువే అంటున్నాయి తాజా అధ్యయనాలు... బిగుతైన జీన్స్‌, ఒంటికి అంటిపెట్టుకున్నట్టుండే లెగ్గింగ్స్‌, ఊపిరాడనివ్వని బ్రా, మచ్చలు పడేలా కట్టే పెట్టీకోట్‌ నాడాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు నిపుణులు.

Published : 21 Apr 2024 02:03 IST

బిగుతుగా ఉండే దుస్తులు చక్కని ఆకృతినిస్తాయని మనం ఇష్టపడతాం కానీ... వాటితో అనారోగ్యాలూ ఎక్కువే అంటున్నాయి తాజా అధ్యయనాలు...

బిగుతైన జీన్స్‌, ఒంటికి అంటిపెట్టుకున్నట్టుండే లెగ్గింగ్స్‌, ఊపిరాడనివ్వని బ్రా, మచ్చలు పడేలా కట్టే పెట్టీకోట్‌ నాడాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు నిపుణులు.

ఉదాహరణకి కొంతమంది చీర కట్టేటప్పుడు పెట్టీకోట్‌ బిగుతుగా ఉండాలని నాడా లేదా బొందుని గట్టిగా లాగి ముడి వేస్తారు. అలా ఏళ్లు తరబడి చేస్తే నడుము చుట్టూ నాడా తాలుకూ మచ్చలు నల్లగా కనిపిస్తాయి. పైగా చర్మం బాగా రాపిడికి గురవుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే తీవ్రమైన చర్మ సమస్యలు వస్తాయని అరుదుగా క్యాన్సర్‌ కణాలు కూడా ఉత్పన్నం కావొచ్చని దిల్లీకి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆడవాళ్లలోనే కాదు.. బిగుతుగా ఉండే జీన్స్‌ని కొన్నేళ్లపాటు వేసుకొనే మగవాళ్లలోనూ ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. కశ్మీర్‌లో అయితే శీతాకాలం వెచ్చగా ఉండేందుకు బొగ్గులు రాజేసిన కాంగ్రీ అనే వెదురు బుట్టని ఒడిలో దగ్గరగా పెట్టుకుంటారట.

ఆ వేడికి సంతాన సామర్థ్యం తగ్గుతోందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే బ్రాలు, జిమ్‌కెళ్లేటప్పుడు వేసుకొనే దుస్తులు వంటివి మనకు సౌకర్యంగా ఉండాలి. అలా కాకుండా బిగుతుగా, గాలి ఆడనట్టుగా, లోపల తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తుంటే మాత్రం వాటికి దూరంగా ఉండటమే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్