ఆరుబయట ఆడుతున్నారా..!

ఈ రోజుల్లో పిల్లలు గ్యాడ్జెట్లతోనే సమయం ఎక్కువగా గడిపేస్తున్నారు. దాంతో వాళ్లలో ఒత్తిడి, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు శారీరక శ్రమనిచ్చే ఆటలాడటమే పరిష్కారం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది. పెద్దల్లో మాత్రమే కాదు పిల్లల్లోనూ ఒత్తిడి ఎక్కువే. ఇందుకు కారణాలు అనేకం.

Published : 23 Apr 2024 01:39 IST

ఈ రోజుల్లో పిల్లలు గ్యాడ్జెట్లతోనే సమయం ఎక్కువగా గడిపేస్తున్నారు. దాంతో వాళ్లలో ఒత్తిడి, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు శారీరక శ్రమనిచ్చే ఆటలాడటమే పరిష్కారం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది.

పెద్దల్లో మాత్రమే కాదు పిల్లల్లోనూ ఒత్తిడి ఎక్కువే. ఇందుకు కారణాలు అనేకం. ఆరుబయట ఆటలు వీరిలో ఆ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరానికి డి-విటమిన్‌ అందిస్తాయి. ఫలితంగా ఎముకలూ ఆరోగ్యంగా ఉంటాయి. రన్నింగ్‌, జంపింగ్‌ వంటివి బరువు పెరగకుండా చేస్తాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తీ మెరుగుపడుతుంది.

  • పిల్లలు ఆడటం మొదలుపెడితే ఆపడం కష్టం. అంతలా లీనమైపోతారు మరి. ఇదీ మంచిదేనట. వారు ఆటలోని ప్రతి అంశాన్నీ నిశితంగా గమనించడం అలవాటవుతుంది. పైగా సహజకాంతిలో ఆడితే కంటిచూపూ మెరుగవుతుంది.
  • ఆరు బయట ఆడటం వల్ల తోటి పిల్లలతో కలుస్తారు, మాట్లాడతారు. దాంతో సామాజిక నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, సొంతంగా ఆలోచించడమూ నేర్చుకుంటారు. గాలి, వెలుతురులో ఆడటం వల్ల వారిలో మెలటోనిన్‌ వృద్ధి చెంది, చిన్నారులకి నిద్ర బాగా పడుతుంది.
  • బుడతలు బయట ఆడుతున్నారంటే చుట్టూ ఉండే పరిసరాలను గమనించకుండా ఉంటారా! ఏ మూల ఏముందంటూ... ప్రతి విషయాన్నీ తెలుసుకోవడానికే చూస్తారు. ఈ అలవాటు వారిలో సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఆందోళన, నిరాశ నిస్పృహలు దరిచేరనీయదు. ఇంకా ఏడీహెచ్‌డీ లక్షణాలు ఉంటే వాటినీ తగ్గిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్