భవిష్యత్తుపై బెంగతో నిద్రపోవట్లేదట...

రాత్రైతే చాలు ఫోన్లు పట్టుకుని గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపే వారే ఎక్కువ. మారుతున్న జీవన శైలితో అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా పబ్‌లు, పార్టీలు అంటూ అనారోగ్యాల బారినపడుతున్న వారూ పెరిగిపోతున్నారు.

Published : 24 Apr 2024 01:44 IST

రాత్రైతే చాలు ఫోన్లు పట్టుకుని గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపే వారే ఎక్కువ. మారుతున్న జీవన శైలితో అర్ధరాత్రి వరకూ నిద్రపోకుండా పబ్‌లు, పార్టీలు అంటూ అనారోగ్యాల బారినపడుతున్న వారూ పెరిగిపోతున్నారు. అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ నిద్రపోని మహిళల సంఖ్య పెరిగినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్లీప్‌ అవేర్‌నెస్‌ వీక్‌, స్లీప్‌ డే సందర్భంగా ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

పురుషులతో పోలిస్తే 40 శాతం మంది మహిళలు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారట. ముఖ్యంగా పిన్నవయసులోనే నిద్రలేమికి గురవుతున్నట్లు సమాచారం. దీనికి కారణాలు తర్కించగా కుటుంబ, శారీరక, మానసిక సమస్యలకు తోడు తమ, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ 24శాతం మంది నిద్రపోవడం లేదట. గ్రామాల కన్నా పట్టణాల్లో నివాసముంటున్న స్త్రీలే ఆలోచనలతో నిద్రకు దూరమవుతున్నారు. దాదాపు 34శాతం మంది మహిళలు 4గంటలు మాత్రమే నిద్రపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్