ఎండకో గొడుగు..!

భగభగ మండే భానుడి ప్రతాపానికి అడుగుబయట పెట్టాలంటేనే భయం. ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలని అమ్మాయిలు ఎస్‌పీఎఫ్‌ క్రీములనీ, స్కార్ఫ్‌లనీ ఎన్నో వాడుతుంటారు. కానీ సూర్య శక్తి ముందు అవెంత చెప్పండి! అందుకే ఇప్పుడు వర్షాల్లోనే కాదు ఎండకీ గొడుగు పట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. వీటి లోపలి భాగంలో వేసే ప్రత్యేకమైన పూత బయటి ఉష్ణోగ్రతను లోపలికి రాకుండా అడ్డుకుని, అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

Updated : 25 Apr 2024 14:54 IST

భగభగ మండే భానుడి ప్రతాపానికి అడుగుబయట పెట్టాలంటేనే భయం. ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలని అమ్మాయిలు ఎస్‌పీఎఫ్‌ క్రీములనీ, స్కార్ఫ్‌లనీ ఎన్నో వాడుతుంటారు. కానీ సూర్య శక్తి ముందు అవెంత చెప్పండి! అందుకే ఇప్పుడు వర్షాల్లోనే కాదు ఎండకీ గొడుగు పట్టాల్సిందే అంటున్నారు నిపుణులు.

అల్ట్రా వయోలెట్‌ గొడుగులు..

వీటి లోపలి భాగంలో వేసే ప్రత్యేకమైన పూత బయటి ఉష్ణోగ్రతను లోపలికి రాకుండా అడ్డుకుని, అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. దానివల్ల ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌, చర్మక్యాన్సర్ల నుంచీ రక్షణ పొందవచ్చు. ఫోల్డింగ్‌, క్లాసిక్‌, గోల్ఫ్‌... లాంటి రకాల్లో ఇవి దొరుకుతున్నాయి.

బండికీ అండ...

నడిచి వెళ్లేటప్పుడు గొడుగు పట్టుకుని వెళ్లిపోతాం సరే. మరి స్కూటీ, బైక్‌లపై ప్రయాణించాల్సి వచ్చినప్పుడూ రక్షణ కావాలి కదా! అలాంటప్పుడు బైక్‌, స్కూటర్‌ గొడుగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యూవీ గొడుగులు ఉన్నాయి. దీన్ని స్కూటీ హ్యాండిల్‌కు బిగించుకుంటే సరి.

చల్లని గాలి... మనసుకు హాయి...

స్పోర్ట్స్‌ ఈవెంట్లు చూడాలంటే బయట ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు కేవలం ఎండను ఆపడమే కాదు, ఉక్కపోతను అడ్డుకుని చల్లని గాలిని అందించే గొడుగులూ ఉన్నాయి. అవే ఫ్యాన్‌ అండ్‌ మిస్ట్‌ర్‌ బ్రీజ్‌ గొడుగులు. లోపలి కమ్మీకి పైభాగంలో ఓ చిన్న ఫ్యాన్‌, నీళ్లను చిమ్మే మిస్టర్‌ స్ప్రే బాటిల్‌ అమర్చి ఉంటాయి. హ్యాండిల్‌ దగ్గర బ్యాటరీలు వేసుకునే ఏర్పాటు ఉంటుంది. హ్యాండిల్‌ అడుగుభాగంలో ఉన్న పైపుతో నీళ్లు పైకి పంపొచ్చు. కావాల్సినప్పుడు హ్యాండిల్‌ దగ్గర ఉండే బటన్‌ నొక్కితే చాలు. మిస్ట్‌ ఆన్‌ అయి, ఫ్యాన్‌ గాలికి చల్లటి నీటి తుంపర్లూ మనపై పడతాయి. జుట్టు అందులో చిక్కుకునే ప్రమాదం లేకుండా, మెష్‌ కూడా ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ గొడుగులు యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పించడమే కాదు, చల్లటి గాలితో మనసుకి హాయినిస్తాయి. గొడుగుతోపాటు వాటర్‌ బాటిల్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ కేబుల్‌ కూడా వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 5 గంటల పాటు పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ఎండకో గొడుగు పట్టేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్