మెనోపాజా... వ్యాయామం చేయండి!

నలభై అయిదు వచ్చాయో లేదో మెనోపాజ్‌ లక్షణాలు మొదలవుతాయి. వేడి ఆవిర్ల దగ్గర్నుంచి ఎముకలు గుల్లబారడం వరకు ఎన్నెన్ని సమస్యలు? ఆమెలో బయటికి కనిపించే మార్పునే అంతా గమనిస్తారు. కానీ లోపల మథనం తనకే తెలుస్తుంది. ఆ ఉక్కిరిబిక్కిరితనం నుంచి బయటపడాలంటే వ్యాయామమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఎలాగంటే...

Published : 25 Apr 2024 02:18 IST

నలభై అయిదు వచ్చాయో లేదో మెనోపాజ్‌ లక్షణాలు మొదలవుతాయి. వేడి ఆవిర్ల దగ్గర్నుంచి ఎముకలు గుల్లబారడం వరకు ఎన్నెన్ని సమస్యలు? ఆమెలో బయటికి కనిపించే మార్పునే అంతా గమనిస్తారు. కానీ లోపల మథనం తనకే తెలుస్తుంది. ఆ ఉక్కిరిబిక్కిరితనం నుంచి బయటపడాలంటే వ్యాయామమే పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఎలాగంటే...

  • క్రమం తప్పకుండా చేసే వ్యాయామం... హార్మోనుల్లో అసమతుల్యతనే కాదు, భావోద్వేగాలను అదుపు చేయడంలోనూ, సుఖమైన నిద్రను అందివ్వడంలోనూ సాయపడుతుంది. అయితే యోగా, నడక, పరుగుల్లో ఏది ఎంచుకున్నా కార్డియో, స్ట్రెంత్‌కి సంబంధించిన వాటికీ ప్రాధాన్యమివ్వాలి.
  • సైక్లింగ్‌, బ్రిస్క్‌వాక్‌, ఏరోబిక్‌ వంటివి వేడిఆవిర్లు, రాత్రుళ్లు చెమటకు అడ్డుకట్ట వేస్తాయట. యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు కూడా సాయపడేవే. ఇవైతే మంచి నిద్రనీ అందిస్తాయి. నెలసరి క్రమం తప్పడం, నిద్రలేమి వంటివి కనిపించగానే వ్యాయామంపై దృష్టిపెడితే చాలావరకూ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • చిన్నవాటికే కోపం... తెలియని ఒత్తిడి, ఆందోళన... అంతలోనే బాధ... ఈ సమయంలో మామూలే. చుట్టూ వాతావరణం ఎలా ఉంది? మీకు సాయమందిస్తూ, సంతోషంగా ఉంచేలా ఉంటే ఇంకా మంచిది. ఇలా చేయడంలో స్నేహితులదే ప్రధాన పాత్ర. అందుకే ఒంటరిగా కాకుండా నలుగురైదుగురితో కలిసి వ్యాయామం చేయండి. వాళ్ల అనుభవాలు అనవసర భయాలను తొలగిస్తాయి. పోటీ ఉంటే వ్యాయామం కొనసాగించాలన్న ఉత్సాహం పెరుగుతుంది. సరదా కబుర్లు ఆనందాన్నిచ్చే హార్మోన్ల విడుదలలో సాయపడతాయి.
  • మెటబాలిజంలో మార్పులు అధిక బరువుకు కారణమవుతాయి. తగ్గిన ఈస్ట్రోజన్‌ స్థాయులు ఎముకలు గుళ్లబారేలా చేస్తాయి. దీంతో ఆస్టియోపోరోసిస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి, వ్యాయామం చేస్తే ఈ ముప్పులతోపాటు కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడమూ తగ్గుతాయి. సైక్లింగ్‌, తాడాట వంటివి ఈ విషయంలో బాగా తోడ్పడతాయి.
  • ఈ సమయంలో పోషకాహారంపై దృష్టిపెట్టడం తప్పనిసరి. అయితే... ఇతరులను అనుసరించొద్దు. మెనోపాజ్‌ లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. కాబట్టి, ఎవరినీ గుడ్డిగా అనుసరించి సప్లిమెంట్లనీ వాడొద్దు. నిపుణుల సాయం తీసుకోవడం మేలు. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా- 3- ఫ్యాటీ యాసిడ్లు, బి- విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వడమూ మర్చిపోవద్దు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్