పోషకాల నీలం చీజ్‌!

చీజ్‌తో చేసిన వంటకాలంటే చిన్నా, పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే ఇది ఈ మధ్య బోలెడంత పాపులారిటీనీ సంపాదించుకుంది. ఇందులోనూ బోలెడన్ని రకాలు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చీజ్‌లో చెద్దర్‌, మొజరెల్లా, పామెజాన్‌, స్విస్‌... వంటి పలు రకాలకు ఆదరణ ఎక్కువ.

Published : 04 May 2024 01:55 IST

చీజ్‌తో చేసిన వంటకాలంటే చిన్నా, పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే ఇది ఈ మధ్య బోలెడంత పాపులారిటీనీ సంపాదించుకుంది. ఇందులోనూ బోలెడన్ని రకాలు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చీజ్‌లో చెద్దర్‌, మొజరెల్లా, పామెజాన్‌, స్విస్‌... వంటి పలు రకాలకు ఆదరణ ఎక్కువ. వాటి సరసన ఇప్పుడు బ్లూ చీజ్‌ కూడా చేరిందండోయ్‌! నీలం, ఆకుపచ్చ రంగు చారికలతో అచ్చం మార్బుల్‌ని గుర్తుతెస్తుంది. సాధారణంగా పాశ్చరైజ్‌ చేసిన మేక, ఆవు, గేదె పాలను పులియబెట్టి చీజ్‌ తయారుచేస్తారు. అయితే, ఈ బ్లూ చీజ్‌ చేయడానికి పెన్సిలియం రోక్ఫోర్ట్‌ మోల్డ్‌ కల్చర్‌ని వాడతారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన బ్యాక్టీరియా వల్లే దీనికి కంటికింపైన రంగూ, రుచీ వస్తాయి. పులిసే కొద్దీ... చీజ్‌ పరిమాణం పెరిగి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. వాటిల్లో పెన్సిలియం వల్ల నీలం, ఆకుపచ్చ రంగులు సిరల్లా పరచుకుంటాయి. ఇందులో పోషకాల మోతాదూ ఎక్కువే. అందుకే, ఈ మధ్య సాధారణ చీజ్‌ రకాలకు బదులుగా దీన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులోని కాల్షియం దంతాలనూ, ఎముకలనూ దృఢంగా చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో మహిళల్ని ఎక్కువగా ఇబ్బందిపెట్టే ఆస్టియోపోరోసిస్‌ నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక, ఈ చీజ్‌లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఉండే ప్రొబయాటిక్‌ లక్షణాలు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. శరీరం పోషకాలనూ సక్రమంగా శోషించుకునేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్