నవ్వితే లాభాలెన్నో!

ఒత్తిడి, ఆందోళన అనిపిస్తే కామెడీ వీడియోలు చూడండి. వాటితో వచ్చే నవ్వు వాటిని మటుమాయం చేస్తుందన్న సలహా చాలాసార్లే వినుంటాం. కానీ దానివల్ల మనకీ ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుసా?

Updated : 05 May 2024 03:35 IST

ఒత్తిడి, ఆందోళన అనిపిస్తే కామెడీ వీడియోలు చూడండి. వాటితో వచ్చే నవ్వు వాటిని మటుమాయం చేస్తుందన్న సలహా చాలాసార్లే వినుంటాం. కానీ దానివల్ల మనకీ ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుసా?

  •  పిల్లలు పుట్టాక, మెనోపాజ్‌లో బరువు పెరుగుతుంటాం. తగ్గడానికి ఎన్నెన్ని కష్టాలు పడతాం? కొలతలేసుకుని మరీ ఆహారాన్ని తింటుంటాం. మీరోజువారీ ప్రక్రియలో ‘నవ్వు’ను కూడా చేర్చుకోండి. పదిహేను నిమిషాలు కామెడీ వీడియోలు చూడండి. అది 40 కెలోరీలను తగ్గించగలదని ఓ అమెరికన్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, మంచి కొలెస్ట్రాల్‌ పెరిగి, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
  • ఇప్పుడు గర్భం దాల్చడానికి ఐవీఎఫ్‌ను ఆశ్రయిస్తున్న వారెంతమందో. అది ఎంతవరకూ సఫలమవుతుందో అన్న కంగారు సహజమే. నిజానికి ఆ సమయంలో చింతలన్నీ వదిలేసి, ఆనందంగా నవ్వాలట. నవ్వు ఆ ఒత్తిడిని తగ్గించడమే కాదు... శరీరంలోని అవయవాలన్నింటికీ ఆక్సిజన్‌ బాగా అందిస్తుంది. దీంతో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడంతోపాటు ట్రీట్‌మెంట్‌కి మరింత బాగా స్పందించేలా చేస్తుందట. అంతేకాదు, సాధారణంగా ప్రెగ్నెన్సీలో చాలామందికి మధుమేహం, బీపీ వంటివి పలకరిస్తాయి కదా? రోగనిరోధకతా తగ్గుతుంది. అవి దరిచేరొద్దన్నా ఆ కాబోయే అమ్మ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా నవ్వును బహుమతిగా ఇవ్వాలంటున్నారు నిపుణులు.
  • నెలసరిలో ఎంత చిరాకు? పైగా నొప్పి. అప్పుడూ వినోదాన్ని పంచే కార్యక్రమాలను చూడండి. వాటినిచూస్తూ కడుపుబ్బా నవ్వేయండి. ఎండార్ఫిన్లు విడుదలై నొప్పి నుంచి చాలావరకూ ఉపశమనం కలుగుతుంది. ఇవేకాదు, రోజంతా పనితో అలసిపోయా అనిపించినప్పుడూ ‘నవ్వు’ని ఆశ్రయించండి. శరీరమంతా సేదతీరడంలో ఇది సాయపడుతుంది. రోజూ కనీసం 15 నిమిషాలు కేటాయించండి చాలు. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయంటే నమ్మండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్