ఏకాగ్రతను పెంచే బంతాట

కాలక్షేపం అంటూ ఫోన్లూ, ట్యాబ్‌లకు అతుక్కుపోతోన్న పిల్లల మనసు మళ్లించాలంటే ఆరుబయట ఆడించే ఆటలే సరైన మార్గం.

Updated : 07 May 2024 13:15 IST

కాలక్షేపం అంటూ ఫోన్లూ, ట్యాబ్‌లకు అతుక్కుపోతోన్న పిల్లల మనసు మళ్లించాలంటే ఆరుబయట ఆడించే ఆటలే సరైన మార్గం. ఇవి వారికి శారీరక శ్రమను అందించడమే కాదు, మెదడునీ చురుగ్గా ఉంచుతాయి. అలాంటిదే ఈ బ్యాలెన్సింగ్‌ బాల్‌ గేమ్‌. దీనికోసం మీరు చేయాల్సిందల్లా... ముందు ఒక లక్ష్యం ఏర్పాటు చేయాలి. దానికి ఐదు మీటర్ల దూరం వరకూ కాస్త ఎడం ఇచ్చి సమాంతరంగా రెండు గీతలు గీయాలి.

ఇద్దరు చిన్నారుల్ని లక్ష్యానికి మరోవైపు లైన్‌ చివర నిలబెట్టాలి. వారి చేతికి ఒకేలాంటి కర్రలిచ్చి ఇద్దరినీ పట్టుకోమనాలి. ఇప్పుడు వాటిపై ఓ బంతిని పెడితే, కింద గీత దాటకుండా ఆ బాల్‌ కింద పడకుండా ఇద్దరూ బ్యాలెన్స్‌ చేసుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ ఆట ఏకాగ్రతను పెంచడంతో పాటు, ఇతరులతో సులువుగా కోఆర్డినేట్‌ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్