శరీరాన్ని చల్లబరిచే చంద్రభేదన..!

వేసవిలో ఉపశమనం కోసం ఒకసారి చంద్రభేదన ప్రాణాయామాన్ని ప్రయత్నించి చూడండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా సులభంగా చేయవచ్చు.

Published : 18 May 2024 01:17 IST

వేసవిలో ఉపశమనం కోసం ఒకసారి చంద్రభేదన ప్రాణాయామాన్ని ప్రయత్నించి చూడండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా సులభంగా చేయవచ్చు.

ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకోవాలి. ఎడమ చేతిని చిన్‌ముద్రలో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్రలో అంటే.. చూపుడువేలు, మధ్యవేలు లోనికి మడిచి బొటనవేలితో మీ కుడివైపు నాసికా రంధ్రాన్ని మూసి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా దీర్ఘశ్వాస తీసుకోవాలి. ఆపై ఉంగరం, చిటికెన వేళ్లని దగ్గరగా చేర్చి రెండిటితో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి, కుడివైపు నుంచి శ్వాసను బయటకి వదలాలి. ఈ క్రమంలో ఊపిరి బిగపట్టడం వంటివి చేయకూడదు. ఇలా ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుని కుడివైపు వదులుతూ, 15సార్లు చొప్పున రోజూ పావుగంట చేయాలి. చివరగా కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఈ ప్రాణాయామం చేయడంవల్ల వేసవిలో శరీర ఉష్ణోగ్రత తగ్గి, హాయిగా అనిపిస్తుంది. రక్తపోటు, పైల్స్‌ అదుపులో ఉంటాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వీటితోపాటు శరీరాన్ని చల్లగా ఉంచడానికి మంచినీటితో పాటు మజ్జిగ, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. కఫం, ఆస్తమా ఎక్కువ ఉన్నవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలు తగ్గించాలి.

శిరీష, యోగ గురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్