వాముతో ఆరోగ్యం..!

ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు వెంటనే డాక్టరు, మెడికల్‌ షాప్‌ అంటూ పరుగులు పెడుతుంటాం. నిజానికి మన వంటిల్లే ఔషధాల గని అని మీకుతెలుసా! డబ్బాలో ఉండే వాము అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Published : 22 May 2024 01:40 IST

ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు వెంటనే డాక్టరు, మెడికల్‌ షాప్‌ అంటూ పరుగులు పెడుతుంటాం. నిజానికి మన వంటిల్లే ఔషధాల గని అని మీకుతెలుసా! డబ్బాలో ఉండే వాము అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో వామును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటూ బరువూ తగ్గుతారు.

  • ఎండల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతకి బయట ఉష్ణోగ్రత తోడై డయేరియా, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. గ్లాసు నీటిలో చెంచా వామువేసి సగం అయ్యేవరకు మరిగించి గోరువెచ్చగా తాగితే అజీర్తి తగ్గుతుంది.
  • నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి మూడుపూటలా వామునీటిని తాగితే ఫలితం ఉంటుంది.
  • బరువు తగ్గడానికి.. గ్లాసునీళ్లలో చెంచా వాము రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తేనె కలిపి పరగడుపున తాగితే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్