సముద్రమంతా కళ్లల్లోనే..!

మీరెప్పుడైనా సముద్రం, నదుల ఒడ్డున కూర్చొని అలల్ని గమనించారా? సున్నితంగా తీరాన్ని తాకుతోన్న అలలైనా, నిర్మలంగా పారుతోన్న సెలయేరైనా, విశాలంగా పరుచుకుని ఉన్న సముద్రాన్ని చూసినా ఏదో తెలియని ఆనందం కదా! అంతెందుకు... గాజు గ్లాసులో నీళ్లను తదేకంగా చూడండి... లోతైన సముద్రంలో ఓ చిన్న భాగాన్ని చూస్తున్నట్లు అనుభూతి చెందుతాం కదా! దానివల్ల ఒకరకమైన ప్రశాంతమైన భావన.

Published : 05 Jun 2024 15:46 IST

మీరెప్పుడైనా సముద్రం, నదుల ఒడ్డున కూర్చొని అలల్ని గమనించారా? సున్నితంగా తీరాన్ని తాకుతోన్న అలలైనా, నిర్మలంగా పారుతోన్న సెలయేరైనా, విశాలంగా పరుచుకుని ఉన్న సముద్రాన్ని చూసినా ఏదో తెలియని ఆనందం కదా! అంతెందుకు... గాజు గ్లాసులో నీళ్లను తదేకంగా చూడండి... లోతైన సముద్రంలో ఓ చిన్న భాగాన్ని చూస్తున్నట్లు అనుభూతి చెందుతాం కదా! దానివల్ల ఒకరకమైన ప్రశాంతమైన భావన. అందుకే ఆ హాయి వాతావరణాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలని జపనీయులైతే ‘కోయి కొలను’ పేరుతో ఇళ్లలో చిన్నచిన్న కొలనులను ఏర్పాటు చేసుకుంటారు. అంత మహత్యం ఉంది వీటికి మరి. వర్షం పడినప్పుడు కిటికీపై ఏర్పడే నీటి బిందువుల నుంచి ఒడ్డున ఎగసిపడే అలల వరకూ నీళ్లను ఏ పరిమాణంలో చూసినా ఆనందం కలుగకమానదు. మానసిక ప్రశాంతతను ఇచ్చే ఈ వాటర్‌ సీయింగ్‌ అనేది ఒకరకంగా ధ్యానం లాంటిది కూడా. మీరూ ఓసారి అలా కామ్‌గా కూర్చుని తదేకంగా నీటి అందాన్ని చూడడానికి ప్రయత్నించండి మరి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్