ఆడవాళ్లనే పీడిస్తున్నాయివి..!

ఎప్పుడైనా ఒకసారి కాలు, చేయి నొప్పి వస్తేనే మగవాళ్లు అల్లాడిపోతుంటారు. కానీ, వెన్నునొప్పి, ఆస్టియోఆర్థరైటిస్, తలనొప్పి, మైగ్రెయిన్‌... లాంటి దీర్ఘకాలిక నొప్పులు ఆడవాళ్లను అతలాకుతలం చేస్తున్నాయట.

Published : 06 Jun 2024 01:33 IST

ప్పుడైనా ఒకసారి కాలు, చేయి నొప్పి వస్తేనే మగవాళ్లు అల్లాడిపోతుంటారు. కానీ, వెన్నునొప్పి, ఆస్టియోఆర్థరైటిస్, తలనొప్పి, మైగ్రెయిన్‌... లాంటి దీర్ఘకాలిక నొప్పులు ఆడవాళ్లను అతలాకుతలం చేస్తున్నాయట. మగవారితో పోలిస్తే వీటిబారిన పడుతోన్న ఆడవాళ్లే ఎక్కువట. సుదీర్ఘకాలం కొనసాగే ఈ సమస్యలతో నాణ్యమైన జీవనం గడపలేకపోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మహిళలు ఈ నొప్పులను పంటి బిగువన భరిస్తున్నారనీ, సరైన వైద్యం అందేవారు చాలా తక్కువనీ లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కుంగుబాటు, నిద్రలేమి, హృద్రోగాలు వంటి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, వెంటనే చికిత్స చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్