ఏకాగ్రతకు గరుడాసనం..!

కాళ్లూ చేతుల్ని మెలి తిప్పి ఒంటికాలిపై గరుడ పక్షిలా నిలబడి వేసే ఈ ఆసనంతో ఎన్నో ప్రయోజనాలు...నిటారుగా నిలబడి... రెండుకాళ్ల మధ్య అర అడుగు దూరం ఉండేలా చూడాలి.

Published : 08 Jun 2024 03:25 IST

కాళ్లూ చేతుల్ని మెలి తిప్పి ఒంటికాలిపై గరుడ పక్షిలా నిలబడి వేసే ఈ ఆసనంతో ఎన్నో ప్రయోజనాలు...

నిటారుగా నిలబడి... రెండుకాళ్ల మధ్య అర అడుగు దూరం ఉండేలా చూడాలి. నెమ్మదిగా మోకాళ్లను వంచుతూ, ఎడమ కాలిని, కుడికాలు మీదుగా తీసుకువచ్చి, ఎడమతొడను కుడితొడపైన ఆనించాలి. నెమ్మదిగా ఎడమకాలిని కుడికాలిపై మెలితిప్పి ఉంచాలి. నేలమీద పాదాన్ని గట్టిగా అదిమిపెట్టి శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తుండాలి. ఇప్పుడు రెండుచేతులను ముందుకు సమాంతరంగా ఉంచాలి. ఎడమచేయి మీదుగా కుడిచేయి తీసుకువచ్చి రెండు చేతులను మెలితిప్పి ఫొటోలో చూపిన విధంగా నమస్కార ముద్రను ముఖానికి ఎదురుగా వచ్చేలా పెట్టాలి. చివరగా శరీరాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఐదడుగుల దూరంలో ఒక కేంద్రబిందువును ఏర్పాటు చేసి దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఇలా పదిహేనుసెకన్ల పాటు చూపును నిలిపి ఉంచి, రెండోవైపు కూడా ప్రయత్నించాలి. ఈ ఆసనం ట్యాక్సిన్లను బయటకి పంపి, ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుంది. నరాల బలహీనతనూ, తుంటి నొప్పినీ తగ్గిస్తుంది. భుజాలూ, చేతులూ, కాళ్లూ దృఢంగా మారతాయి. ఈ ఆసనం చేస్తూనే ఒమెగా- 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్, బ్లూబెర్రీ, కివీ, నారింజ, దానిమ్మ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. మోకాళ్లకు సర్జరీలు అయిన వారు, ఆర్థరైటిస్‌ ఉన్నవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

 శిరీష, యోగ గురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్