బాల్కనీనే.. తోట

ప్రాసెస్‌ చేసిన ఆహారమేమో మంచిది కాదు. సహజమైన కూరగాయలూ పండ్లూ కూడా రసాయనాలతోనే పెరిగి, మగ్గి విషతుల్యమవుతున్నాయి. మరి పరిష్కారమేంటి అంటే... ఇంటి వ్యవసాయమే! కిటికీలు, బాల్కనీ, మెట్ల మీద, టెర్రస్‌ పైన పెట్టుకోవడానికి అనుకూలమైన కుండీలను తెచ్చుకోవాలి. హ్యాండిల్‌ ఊడిపోయిన టంబ్లర్లు, బకెట్లు కూడా ఇందుకు అనుకూలమే. వాటిని సారవంతమైన మట్టితో...

Updated : 24 Nov 2021 05:28 IST

ప్రాసెస్‌ చేసిన ఆహారమేమో మంచిది కాదు. సహజమైన కూరగాయలూ పండ్లూ కూడా రసాయనాలతోనే పెరిగి, మగ్గి విషతుల్యమవుతున్నాయి. మరి పరిష్కారమేంటి అంటే... ఇంటి వ్యవసాయమే!

కిటికీలు, బాల్కనీ, మెట్ల మీద, టెర్రస్‌ పైన పెట్టుకోవడానికి అనుకూలమైన కుండీలను తెచ్చుకోవాలి. హ్యాండిల్‌ ఊడిపోయిన టంబ్లర్లు, బకెట్లు కూడా ఇందుకు అనుకూలమే. వాటిని సారవంతమైన మట్టితో నింపాలి.

పెద్ద కుండీల్లో చిక్కుడు, పొట్ల, దోస తదితర తీగపాదులను, చిన్నవాటిల్లో కొత్తిమీర, పుదీనా, గోంగూర లాంటి ఆకుకూరలను పెంచవచ్చు. ఇక మధ్యస్తంగా ఉండే కుండీల్లో టొమాటోలు, పచ్చిమిర్చి, వంగ, బెండ లాంటి అనేక కూరగాయల మొక్కలను నాటవచ్చు.

ఉల్లిపొట్టు, కాయగూరల చెక్కు, వాడేసిన టీ పొడి, కోడిగుడ్డు డొల్లలు లాంటి వ్యర్థాలను సహజమైన ఎరువుగా వేస్తే సరి. ఎండిన వేపాకును పొడిచేసి మొక్కల మీద జల్లితే పురుగు పట్టదు.

పసుపు, బంగాళదుంప, అల్లం, పెండలం లాంటి దుంపకూరలు పెద్ద శ్రమ లేకుండా ఇట్టే పెరుగుతాయి. ఆకుకూరలు, కూరగాయలతోపాటు బంతి, చేమంతి, మల్లె, మందారం లాంటి పూలమొక్కలను నాటితే ఆ అందమే వేరు. మీ బాల్కనీ తోట అవసరాలు తీర్చడమే కాదు, అనుభూతులనూ పంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్