సరకులు కొంటున్నారా?

పచారీ సామాన్లు, కూరగాయల కోసం దుకాణానికి వెళుతున్నప్పుడు చేతిలో ఓ చిట్టా ఉండాల్సిందే. ఇంట్లో వారికిష్టమైనవే కాదు, ఆరోగ్యాన్ని అందించే వాటినీ ఎంపిక చేయాలి కదా. ముందుగానే ప్రణాళిక, జాబితా తయారు చేసుకుంటేనే అది హెల్దీ షాపింగ్‌ అవుతుంది.

Updated : 05 Jun 2022 04:55 IST

పచారీ సామాన్లు, కూరగాయల కోసం దుకాణానికి వెళుతున్నప్పుడు చేతిలో ఓ చిట్టా ఉండాల్సిందే. ఇంట్లో వారికిష్టమైనవే కాదు, ఆరోగ్యాన్ని అందించే వాటినీ ఎంపిక చేయాలి కదా. ముందుగానే ప్రణాళిక, జాబితా తయారు చేసుకుంటేనే అది హెల్దీ షాపింగ్‌ అవుతుంది.

బజారుకెళ్లే ముందే ఏం కొనాలన్న జాబితా చేతిలో లేకపోతే కంటికి కనిపించేవే ముఖ్యమైనవి అవుతాయి. ముందుగా వంటింట్లో చిన్న పుస్తకం అందుబాటులో ఉంచుకోవాలి. ఖాళీ అవుతున్న వస్తువుల వివరాలు ఎప్పటికప్పుడు అందులో రాసుకోండి. లిస్ట్‌ రాసేటప్పుడు ఈ వివరాలు ఉపయోగపడతాయి. లేదంటే మర్చిపోతాం. ఇంట్లో సరుకులు ఏం మిగిలాయి, ఏం లేవన్నది పరిశీలించుకొని పట్టిక తయారుచేసుకుంటే సామాన్లు వృథా కావు. ఏవేవి ఎక్కువగా వాడ్డం లేదో కూడా గుర్తిస్తే కొనేప్పుడు ఆ మేరకు తగ్గించుకోవచ్చు.

పది, పదిహేను రోజులకు లేదా నెలకు సరిపడా సామాన్లు ఒకేసారి తెచ్చుకోవడం మంచిది. ప్రతిచిన్న దానికీ నిత్యం దుకాణానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వ్యయమూ తగ్గుతుంది. అవసరానికి సామాన్లు లేవనే ఒత్తిడీ ఉండదు. అలాగే కొనే ప్రతి వస్తువునూ ప్యాకింగ్‌ సమయంతోపాటు నిల్వ కాలాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మరవకూడదు.

పట్టికలో.. ఇందులో పోషకాహార పదార్థాలు, వారం పది రోజులు నిల్వ ఉండేలా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూడాలి. కోడిగుడ్లు, బీన్స్‌, గింజ ధాన్యాలు, ఎండు ఫలాలు వంటి వాటికి ప్రాధాన్య మివ్వాలి. వంటనూనె ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. నెలకు ఒక్కొక్కరికి అర లీటరు నూనె మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు. ఈమేరకు ఇంట్లో సభ్యుల సంఖ్య బట్టి నూనె కొనడం, నెలంతా దాన్నే సరి పెట్టడానికి ప్రయత్నించడం మంచిది.

ఫ్రిజ్‌లో.. మిగిలిన కూరగాయల నుంచి గుడ్లు, రొట్టె, ఎసెన్స్‌, తేనె, కోకోనట్‌ మిల్క్‌, పిల్లల సాస్‌లు, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, వెన్న, నెయ్యి వంటి వాటి దాకా అన్నీ ఫ్రిజ్‌లో ఉంటాయి. బజారుకెళ్లేముందు ఓసారి పరిశీలించుకుంటే ఇంకా అవసరమైనవే తెచ్చుకోవచ్చు. అలాగే కొన్ని కాలం తీరినవి కూడా ఫ్రిజ్‌లో ఉండిపోతాయి. వాటిని బయట పడేయాలి. అవసరమైతే తాజాగా తెచ్చుకుని మళ్లీ ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్