అయినా.. మార్చాల్సిందే!

ఇంట్లో కొన్ని వస్తువులు పాతవి అయినా, చినిగిపోయినా మార్చేస్తుంటాం. మరికొన్నింటిని గడువు తేదీ అయిపోగానే తీసేస్తాం. చూడటానికి బాగుండి, తుది గడువు అయిపోయేవి ఉంటాయి. మరి వాటి సంగతేంటి?

Published : 30 Jun 2022 00:44 IST

ఇంట్లో కొన్ని వస్తువులు పాతవి అయినా, చినిగిపోయినా మార్చేస్తుంటాం. మరికొన్నింటిని గడువు తేదీ అయిపోగానే తీసేస్తాం. చూడటానికి బాగుండి, తుది గడువు అయిపోయేవి ఉంటాయి. మరి వాటి సంగతేంటి?

* స్పాంజ్‌.. వంట పాత్రలను తోమడానికి స్పాంజి స్క్రబర్‌లను వాడుతుంటాం. నాణ్యమైనవి, ఎక్కువ కాలం మన్నుతున్నాయని నెలలపాటు వాడేస్తున్నారా? కుటుంబ ఆరోగ్యానికి హాని చేస్తున్నట్లే. దాని జీవితకాలం రెండు నెలలే. అంతకు మించి వాడొద్దు.

* టాయ్‌లెట్‌ బ్రష్‌లు.. పాడవకపోయినా వీటినీ తరచూ మార్చాలి. ఏడాదికి మించి వాడకూడదు.

* బ్రా.. కొన్ని బ్రాండ్‌లు త్వరగా చినిగిపోవు, చెక్కుచెదరవు. దీంతో వాటినే కొనసాగించడం, మళ్లీ మళ్లీ కొనడం చేస్తుంటాం. కానీ గమనించారా? కొద్ది రోజులకు వాటి స్ట్రాప్స్‌ వదులై భుజం మీద నుంచి జారిపోతుంటాయి. అంటే అర్థం వాటిని మార్చేసే సమయం వచ్చేసిందనే!

* తువ్వాలు.. శరీరం నుంచి నీటిని పీల్చేయడమే కాదు.. మృతకణాలనూ అంటించుకుంటాయి. ఫలితంగా సూక్ష్మజీవులకు నెలవు అవుతుంటాయి. వీటిని ఏడాదిన్నరకు మించి వాడకూడదట.

* మేకప్‌ బ్రష్‌లు.. మనలో రోజూ మేకప్‌ వేసుకునే వారు తక్కువే. వేడుకలు, ప్రత్యేక సందర్భాలప్పుడు ఉపయోగించి, శుభ్రం చేసి పక్కన పెడుతుంటాం. ఇంకెందుకు పాడవుతాయి? హాయిగా ఎన్నాళ్లైనా వాడచ్చనుకుంటాం. కానీ వాటి పీచులు రాలుతున్నా.. మృదుత్వం తగ్గినా వదిలేయాలి.

* దిండ్లు.. తరచూ పక్కదుప్పట్లు, దిండు గలీబులు శుభ్రం చేసుకుంటుంటాం. కానీ గలీబుల నుంచి లోనికి ప్రవేశించే మురికి, నూనెలు, సూక్ష్మజీవులు వదలగొట్టేదెలా? కష్టం కదూ! అవేమో అలా తిష్టవేసి చర్మానికీ, శ్వాసకీ ఇబ్బందిగా మారతాయి. కాబట్టి, ఎంత బాగున్నా దిండ్లను రెండేళ్లకోసారి తీసేయాలి.

* బాత్‌ పఫ్‌.. అసలే తడిని పీల్చుకొని ఉంటాయి. పైగా మృతకణాలు చేరే అవకాశమూ ఎక్కువ. దీంతో సూక్ష్మజీవులకు అడ్డాగా మారుతుంది. కాబట్టి, దీన్ని రెండు, మూడు నెలలకు మించి వాడొద్దు.

* దువ్వెనలు.. దీనికున్న పుల్లలు విరిగిపోవడమే మనకు ప్రామాణికం కదూ! కానీ ఆరు నెలలకు మించి వాడకూడదట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్