అన్నం మిగిలిపోతే...

అన్నం ఆచితూచి వండటం మనలో చాలామందికి చేతకాదు. ఒకవేళ సరిగ్గా అంచనా వేసి సరిపోయేలా వండినా ఎవరో ఒకరు అసలే తినకపోవడమో కాస్తే తినడమో జరుగుతుంటుంది. వస్తారనుకున్న అతిథులు రాకపోతే చెప్పాల్సిందే లేదు.

Updated : 11 Jul 2022 09:02 IST

అన్నం ఆచితూచి వండటం మనలో చాలామందికి చేతకాదు. ఒకవేళ సరిగ్గా అంచనా వేసి సరిపోయేలా వండినా ఎవరో ఒకరు అసలే తినకపోవడమో కాస్తే తినడమో జరుగుతుంటుంది. వస్తారనుకున్న అతిథులు రాకపోతే చెప్పాల్సిందే లేదు.. బోల్డంత అన్నం మిగిలిపోతుంది. కూరలైతే ఫ్రిజ్‌లో పెట్టి వేడిచేసుకు తినొచ్చు కానీ అన్నం అలా తినలేం. పడేయాలంటే ఉసూరుమనిపిస్తుంది. అలా బాధపడే బదులు చద్దన్నంతో అనేక రకాల టిఫిన్లూ, చిరుతిళ్లూ చేసుకోవచ్చు. ఇకనుంచీ ఒక్కోసారి ఒక్కోటి చేసేయండి.

* ఫ్రిట్టాటా

మూకుట్లో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి నాలుగు లవంగాలు, అర చెంచా మిరియాల పొడి, ఉడికించిన బంగాళాదుంప, చీజ్‌ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి చద్దన్నాన్ని చితిపి అందులో వేసి కొద్దిసేపుంచి తగినంత ఉప్పు వేసి దించితే సరిపోతుంది. రుచికరమైన ఫ్రిట్టాటా తినేయొచ్చు.

* పుడ్డింగ్‌

చిక్కటి పాలు, అరటిపళ్లు ఉంటే చద్దన్నంతో పుడ్డింగ్‌ చేసేయొచ్చు. కొన్ని కొబ్బరిపాలు కూడా కలిపితే ఇక ఆ రుచికి మరేదీ సాటిరాదు, అద్భుతమైన రుచి వస్తుంది.

* ఘుమఘుమలాడే రొట్టె

అన్నాన్ని మెత్తగా చేసి అందులో అల్లం, మిర్చి ముద్ద, వాము, ఉప్పు వేసి కలిపి రొట్టెలుగా చేస్తే పిల్లలూ పెద్దలూ ఇష్టంగా తింటారు.

* చిత్రాన్నం

చద్దన్నంలో ఉప్పు, పసుపు వేసి చితిపి ఆవాలూ పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలతో తాలింపు పెట్టి నిమ్మరసం పిండితే చాలు తయారైపోతుంది.

* పునుగులు

మిగిలిన అన్నంలో కొంత శనగపిండి, అందులో సగం బియ్యప్పిండి, కొన్ని నీళ్లు పోసి అల్లం మిర్చి పేస్టు, ఉప్పు కలిపి పునుగుల్లా వేసుకోవచ్చు.

* సాంబార్‌ రైస్‌

కందిపప్పు, ఉల్లి, బెండ, క్యారెట్‌ తదితర కూరగాయ ముక్కలను ఉడికించుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, సాంబార్‌ పొడి వేసి మరోసారి తెర్లనిచ్చి తాలింపు పెడితే సాంబార్‌ తయార్‌! అందులో చద్దన్నం వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దించేసి కొద్దిగా నెయ్యి వేస్తే రుచికరమైన సాంబార్‌ రైస్‌ సిద్ధం.

* దద్దోజనం

ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అల్లం ముక్కలు, కచాపచా నలిగిన మిరియాలతో తాలింపు వేసి, అది చల్లారాక పెరుగు వేసి అందులో చద్దన్నం వేస్తే సరి దద్దోజనం తయారైపోతుంది. శ్వాసకోశ ఇబ్బందులున్నవాళ్లకు ఇది నిషిద్ధం. ఇతర వంటకాలకు మల్లే ఇక్కడ చద్దన్నాన్ని వేడి చేయడంలేదు కనుక జలుబు చేస్తుంది.


ఫ్రైడ్‌ రైస్‌

బీన్స్‌, క్యారెట్‌, ఆలు, పుదీనా, మసాలా పొడి వేసి ఫ్రైడ్‌ రైస్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్