ఇంట్లోనే సహజ క్లీనర్లు!

క్రిములన్నీ పోవాలి.. ఇల్లు తళతళా మెరవాలని క్లీనర్లకు తెగ ఖర్చు పెడతాం కదా! కానీ వాటిల్లో రసాయనాలు

Published : 30 Sep 2022 01:06 IST

క్రిములన్నీ పోవాలి.. ఇల్లు తళతళా మెరవాలని క్లీనర్లకు తెగ ఖర్చు పెడతాం కదా! కానీ వాటిల్లో రసాయనాలు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి పరిష్కారం? సొంతంగా తయారు చేసుకోవడమే!

* ఒక చిన్న నిమ్మకాయను తురిమి ఆ పొట్టు, రెండు బిర్యానీ ఆకులు కప్పు నీటిలో వేసి మరిగించండి. ఆరాక రెండు టేబుల్‌ స్పూన్ల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి, స్ప్రే బాటిల్‌లో పోసి ఉంచుకోండి. దీంతో కప్‌బోర్డులు వగైరా తుడవండి. మెరవడమే కాదు.. సహజ సువాసన కూడా. స్ప్రే చేసే ప్రతి సారీ బాటిల్‌ను షేక్‌ చేయడం మాత్రం తప్పనిసరి.

* కప్పు నీటికి పావుకప్పు వెనిగర్‌, రెండు టేబుల్‌ స్పూన్ల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి స్ప్రే బాటిల్‌లో పోయండి. అద్దాలు, కిటికీలను ఈ మిశ్రమంతో తుడిచి చూడండి. తేలిగ్గా శుభ్రపడతాయి.

* అరకప్పు వెనిగర్‌కి 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున ఆలివ్‌ నూనె, నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి ఓ గాజు బాటిల్‌లో పోసి ఉంచండి. ఏదైనా వస్త్రం లేదా దూది మీద దాన్ని చల్లుకొని చెక్క ఫర్నిచర్‌ని శుభ్రం చేయండి. క్రిములు దూరమవ్వడమే కాదు... చెక్క మెరుస్తుంది.

* బాత్‌రూమ్‌లో పసుపు మచ్చని మరకలా? కప్పు వెనిగర్‌కి ఒక నిమ్మకాయ రసం, రెండు స్పూన్ల బేకింగ్‌ సోడా, నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున కలిపి గోడలపై పిచికారీ చేయండి. అరగంట అయ్యాక బ్రష్‌తో రుద్దుతూ కడిగితే సరి!

* కప్పు మరిగించిన నీటికి అరకప్పు వెనిగర్‌, కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి, ఇల్లు తుడిచే నీటిలో కలపండి. దీంతో తుడిస్తే ఫ్లోర్‌ తేలిగ్గా శుభ్రమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్