గోడకు బుట్టలందం..

పండగ, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ సందర్భాల్లో పూలబొకేలు, పండ్లు ఉంచిన బుట్టలు కానుకలతోపాటు వస్తుంటాయి. వాటితో వృథాగా పడేయకుండా, ఇంటి అలంకరణలో భాగం చేయొచ్చు.

Updated : 10 Oct 2022 15:01 IST

పండగ, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ సందర్భాల్లో పూలబొకేలు, పండ్లు ఉంచిన బుట్టలు కానుకలతోపాటు వస్తుంటాయి. వాటితో వృథాగా పడేయకుండా, ఇంటి అలంకరణలో భాగం చేయొచ్చు.

అయిదారు రకాలైన బుట్టలున్నప్పుడు వాటిని శుభ్రపరిచి పాలిష్‌ రాస్తే మెరుస్తూ ఆకర్షణీయంగా మారతాయి. వీటిని వుడ్‌ ఫర్నిచర్‌ లేదా  ప్లైవుడ్‌ టేబుల్‌, కుర్చీలున్న ముందు గది లేదా హాల్‌లో గోడకు వరుసగా సర్దితే చాలు. వెదురు వర్ణంలో కార్పెట్‌ ఉంటే ఆ గదికి మరింత ప్రత్యేకత వస్తుంది. సోఫాలో వెదురు, నలుపు వర్ణం మ్యాచింగ్‌గా కుషన్‌ కవర్లు ఉండేలా చూడాలి. సోఫా పక్కగా ఇండోర్‌ మొక్క తొట్టె సర్దాలి. గది మధ్యలో వెదురుతో చేసిన టీపాయి ఉంచితే గదంతా కొత్తగా కనిపిస్తుంది. నిత్యం ఫొటో ఫ్రేములే కాకుండా మధ్యలో ఈ తరహా అలంకరణతో ఇంటి అందాన్ని అప్పుడప్పుడూ మారుస్తుంటే మనసుకు హాయిగానూ అనిపిస్తుంది.

మొక్కలతో.. అర్ధచంద్రాకారం లేదా గుండ్రని బుట్టలను మొక్కలు సర్దడానికి ఉపయోగించాలి. లోతుగా ఉండే బుట్టలో ఇండోర్‌ మొక్క లేదా తీగజాతి మొక్కనుంచిన తొట్టెను అమర్చాలి. ఆ తర్వాత గోడ మూలల్లో చివరగా మేకుకు దీన్ని తగిలించాలి. మొక్కకు ఒకేసారి నీటినెక్కువగా అందించకుండా కొంచెంగా చల్లుతూ.. జాగ్రత్తపడితే చాలు. గది గోడలకు ఈ బుట్టలు ప్రత్యేక అలంకరణగా మారతాయి. లోతు తక్కువగా, గుండ్రంగా ఉండే బుట్టల్లో ఫ్యాన్సీగా తీగజాతి మొక్కలను ఎంచుకొని అమర్చాలి. దీన్ని గోడకు తగిలిస్తే సహజంగా కనిపిస్తూ ప్రత్యేకంగా ఉంటాయి. హ్యాండిల్స్‌ ఉన్న బుట్టల్లో ఎండిన కొమ్మలు కొన్నింటిని సర్ది, మధ్యలో ఇండోర్‌ ప్లాంట్‌ తొట్టెనుంచి గోడకు తగిలించాలి. రెండు మూడు బుట్టలను ఒకచోటే సర్దితే చూడటానికి మరింత ఫ్యాన్సీగా అనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్