అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌..

పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని, వివాహితలు మంచి సంతానం కలగాలని నిర్వహించుకొనేదే అట్లతద్ది. ఈరోజు తెల్లవారుఝామునే భోజనం చేస్తారు. ఇవి ఆశ్వయుజ మాసంలో ప్రవేశించే చలిని తట్టుకునే పదార్థాలు.

Published : 12 Oct 2022 00:33 IST

పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని, వివాహితలు మంచి సంతానం కలగాలని నిర్వహించుకొనేదే అట్లతద్ది. ఈరోజు తెల్లవారుఝామునే భోజనం చేస్తారు. ఇవి ఆశ్వయుజ మాసంలో ప్రవేశించే చలిని తట్టుకునే పదార్థాలు. గౌరీదేవికి చంద్రుడు ప్రత్యధి దేవత కనుక చంద్రుణ్ణి చూసిన తర్వాతే గౌరీపూజ చేస్తారు. సాయంత్రం ఆకాశంలో చంద్రుణ్ణి చూసి  11 ముడులున్న తోరణం చేతికి కట్టుకుంటారు. బియ్యప్పిండి, మినప్పిండి కలిపిన మిశ్రమంతో 11 అట్లు పోసి గౌరీదేవికి నైవేద్యం పెడతారు. కొన్ని ప్రాంతాల్లో 5 కుడుములు నేవేద్యం పెట్టే సంప్రదాయముంది. 11 అట్లను వాయనమిస్తే స్నేహంగా ఉండే భర్త లభిస్తాడని, 5 కుడుములిస్తే మంచి సంతానం కలుగుతుందని నమ్ముతారు. పూజలో 4 కుడుములు ఒక దానిపై ఒకటి పేర్చి పైనున్న కుడుములో దీపం వెలిగిస్తారు. అది కొండెక్కగానే కింది కుడుములను ప్రసాదంగా తింటారు. ఒంట్లో ఉన్న వేడిని తగ్గించేందుకు ఆషాఢ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లో గోరింటాకు పెట్టుకోవడం తెలిసిందే. వీటిలో అట్లతద్ది చివరిది. ఉయ్యాల ఆటలో చిన్న తమాషా ఉంది. వివాహితలను పెద్దపెట్టున ఊపుతూ భయపెట్టి భర్త పేరు చెప్పమంటారు. ఇదొక సరదా. అట్లతద్దినాడు ఆరట్లు తింటే ఆరోగ్యమని, ముద్దపప్పుతో మూడట్లు తిన్నా మంచిదేనని చెబుతారు. మనమంతా ఉత్సాహంగా నిర్వహించుకొనే ఈ పండుగ సంక్షేమానికీ, సంతోషానికీ కూడా ప్రతీక.

- ఉమాబాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్