ఇలా సర్దితే సౌకర్యమే!

మనం ఎక్కువ సమయం గడిపే వంటగది ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా... దాని ప్రభావం ఇతర పనులపైనా పడుతుంది. మానసికంగానూ ఒత్తిడికి గురి చేస్తుంది. గది ఎంత చిన్నగా ఉన్నా... చిన్న చిన్న చిట్కాలతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు.

Published : 20 Oct 2022 00:34 IST

మనం ఎక్కువ సమయం గడిపే వంటగది ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా... దాని ప్రభావం ఇతర పనులపైనా పడుతుంది. మానసికంగానూ ఒత్తిడికి గురి చేస్తుంది. గది ఎంత చిన్నగా ఉన్నా... చిన్న చిన్న చిట్కాలతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు.

* పదార్థాలన్నీ కనిపించేటట్లు పెట్టుకుంటే... వంట చేసేటప్పుడు హడావిడి తగ్గుతుంది. అందుకోసం పదార్థాలను పారదర్శకంగా ఉండే సీసాల్లో పోసి స్టిక్కర్‌ వేస్తే సరి. అలానే నిత్యం అవసరమయ్యే ఉప్పు, కారం, పసుపూ, తాలింపు గింజలు వంటి వాటిని చిన్న చిన్న బాటిళ్లలో వేసుకుని ఓ ట్రేలో పెట్టుకోండి. పచ్చళ్లు ఓ దాంట్లో, కాఫీ, టీ పొడి... పంచదారల్ని మరో దాంట్లో పెడితే సరి. వంట చేసేటప్పుడు అవసరమైనది మాత్రం దగ్గర పెట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది. స్థలమూ సర్దుబాటు అవుతుంది.

* అల్మారాలను సర్దేటప్పుడు వాటి అడుగున సాధారణంగా వార్తాపత్రికలను వేస్తుంటాం. ఇవి కొన్ని రోజులకే పాతబడిపోతాయి. తరచూ మార్చాలంటే తీరిక దొరకదు. అలాని వదిలేస్తే... చూడ్డానికీ బాగోదు. ఈసారి వాటికి బదులుగా చార్ట్‌పేపర్లను వాడి చూడండి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అలానే, ప్రత్యేకంగా వస్తోన్న డిజైనర్‌ షెల్ఫ్‌ షీట్స్‌నీ ఎంచుకోవచ్చు. వీటి వెనక ఉన్న కాగితం తీసేస్తే నేరుగా అరలో అతికించేయొచ్చు. జిడ్డూ, నీళ్లూ వంటివి పడ్డా... సులువుగా తుడిచేయొచ్చు.

* సరకులు తెచ్చాక కొన్నింటిని సీసాల్లో, డబ్బాల్లో పోస్తాం. మరికొన్ని మాత్రం అవసరమైనప్పుడు చింపి అలానే పెట్టేస్తుంటాం. ఇలా తెరిచిన ప్యాకెట్లు చాలానే ఉంటాయి. ఇవి వంట గదిని చిందరవందరగా కనిపించేలా చేస్తాయి. తర్వాత ఆయా పదార్థాలూ పెద్దగా ఉపయోగపడవు. ఇలాంటి వాటిని పెట్టేందుకు ఓ పెద్ద ప్లాస్టిక్‌ డబ్బాని ఎంచుకోండి. ఓ సీలర్‌ కూడా కొనుక్కుంటే చించిన ప్యాకెట్లను సీల్‌ చేసి అందులో భద్రపరిచేయొచ్చు. అవసరమున్నప్పుడు వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్