గోడపై అక్వేరియం..

నీటి తొట్టెలో కదలాడే రంగురంగుల చేపలు గోడపై ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి అక్వేరియం ఫ్రేములను మనమే తయారుచేసుకోవచ్చు. ఎపాక్సీ రెజిన్‌, హార్డ్‌నర్‌, ఖాళీ కప్పు, ప్లాస్టిక్‌ చెంచా, నాలుగైదు అక్రిలిక్‌ కలర్స్‌, నీళ్లు, ఫ్రేం సిద్ధం చేసుకుంటే వర్ణభరితమైన చేపలు మన ఇంటి గోడలు, టీ బల్లపైనా...

Published : 31 Oct 2022 00:15 IST

నీటి తొట్టెలో కదలాడే రంగురంగుల చేపలు గోడపై ఫ్రేములో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి అక్వేరియం ఫ్రేములను మనమే తయారుచేసుకోవచ్చు. ఎపాక్సీ రెజిన్‌, హార్డ్‌నర్‌, ఖాళీ కప్పు, ప్లాస్టిక్‌ చెంచా, నాలుగైదు అక్రిలిక్‌ కలర్స్‌, నీళ్లు, ఫ్రేం సిద్ధం చేసుకుంటే వర్ణభరితమైన చేపలు మన ఇంటి గోడలు, టీ బల్లపైనా.. కదలాడేలా చేయొచ్చు. అదెలాగో చూద్దాం.

ఫొటో ఫ్రేంలో సరిపోయే చిన్న మెటల్‌ ట్రేను సిద్ధం చేసుకోవాలి. ఇందులో ముందుగా ఎపాక్సీరెజిన్‌, హార్డ్‌నర్‌ను కప్పులో  సమ పాళ్లలో వేసి ప్లాస్టిక్‌ చెంచాతో కలపాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు చెంచాలు ట్రేలో పోసి నాలుగువైపులా పాకేలా కదిపి, రోజంతా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత అద్దంలా గడ్డ కట్టిన దానిపై నాలుగైదురకాల చేపలను చిన్నబ్రష్‌తో వేయాలి. తిరిగి మరో వరుస హార్డ్‌నర్‌ మిశ్రమాన్ని గీసిన చేపల డిజైన్‌పై పోసి మరొకరోజు ఆరనివ్వాలి. ముందురోజు వేసిన చేపలకు మరొక లైనింగ్‌ వేయాలి. ఆ తర్వాత నీటిలో తేలే మొక్కల ఆకులు, చిన్నచిన్న నీటి పూలను వేసి తిరిగి ఇంకొక లేయర్‌గా హార్డ్‌నర్‌ మిశ్రమాన్ని పోయాలి. ఇలా నాలుగైదుసార్లు చేస్తూ చేపలను హైలైట్‌ అయ్యేలా తీర్చిదిద్దితే చాలు. ఆరిన తర్వాత ఈ ట్రేను ఫ్రేంలో బిగించి గోడకు తగిలిస్తే, 3డీ ఎఫెక్ట్‌లో, సహజమైన చేపలు గోడపై కదలాడుతున్నట్లుగా అనిపిస్తాయి. కన్నుల కింపుగా కనిపిస్తూ, ఏ గదిలో ఉంచినా అక్కడంతా ఆకర్షణీయంగా మారిపోతాయి.
బల్లపై.. అందమైన ప్లాస్టిక్‌ లేదా గాజు గిన్నెను కూడా ఇదే పద్ధతిలో చిన్న అక్వేరియంగా మార్చేయొచ్చు. నిజమైన చేపల్లా భ్రమపడేలా చేసే వీటిని టీపాయి లేదా భోజనబల్లపై ఉంచితే చాలు. రంగురంగుల చేపపిల్లలు బల్ల మధ్యలో కదలాడుతున్నట్లు అనిపిస్తూ అందంగా ఉంటాయి. పిల్లల పెన్సిళ్లబాక్సును కూడా అక్వేరియంగా మార్చి, వారి గదిలో ఉంచితే వారికి ఆకర్షణీయంగా అనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్