ముత్యంలాంటి ముగ్గు... ఇల్లంతా వెలుగు..

పండగలు, శుభకార్యాలప్పుడు ముగ్గులతో  తీర్చిదిద్దితే ఇల్లంతా కళకళలాడి పోతుంది. అదే రంగులతో వేసే రంగవల్లులైతే గదిగదికీ మరింత అందాన్ని తెస్తాయి.

Updated : 03 Nov 2022 05:35 IST

పండగలు, శుభకార్యాలప్పుడు ముగ్గులతో  తీర్చిదిద్దితే ఇల్లంతా కళకళలాడి పోతుంది. అదే రంగులతో వేసే రంగవల్లులైతే గదిగదికీ మరింత అందాన్ని తెస్తాయి. ఇంటికింత కళను తెచ్చిపెట్టే ముగ్గును గోడలపైకీ తెచ్చేస్తున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు.

హాలు, డైనింగ్‌రూం, పడకగది అంటూ తేడా లేకుండా ఆయా గదుల పరిమాణాన్ని బట్టి గోడలపై ముగ్గులను డిజైన్లుగా వేస్తున్నారు. ముందుగది వర్ణానికి తగినట్లు గోడ మధ్యగా ఫర్నిచర్‌కు మ్యాచ్‌ అయ్యేలా ముగ్గులను తీర్చిదిద్దుతున్నారు. లివింగ్‌ రూంలో రెండు గోడల మధ్య లేదా గదికి మూలగా వచ్చేలా సగం ముగ్గుని మాత్రమే డిజైన్‌ చేసి కొత్తదనాన్ని అద్దుతున్నారు. ఈ రంగవల్లులకు దగ్గరగా నైట్‌ల్యాంప్‌ ఏర్పాటు ఆ ముగ్గుని మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తోంది.

అలంకరణగా.. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ముగ్గు అలంకరణ వస్తువుల మధ్య కూడా స్థానాన్ని సంపాదిస్తోంది. పూజగదికి సమీపంలో చిన్నచిన్న అలమరల్లాంటి వాటిని ఏర్పాటు చేసి, వాటిలో ఇత్తడి పాత్రలు, మొక్కలుంచిన తొట్టెలు వంటివి సర్ది, వాటికి పైభాగాన, కిందిభాగాన ముగ్గు డిజైన్‌ చేసి గదికి క్లాసిక్‌ లుక్‌ తెస్తున్నారు. ముందుగదిలోనూ దివాన్‌కు పైన వచ్చేలా ఈ తరహాలో ముగ్గుతో అలనాటి సంస్కృతిని గోడలపై ప్రతిఫలించేలా చేస్తున్నారు. ముదురు వర్ణం గోడలపై ముత్యంలా తెల్లగా, లేదా లేతవర్ణం గోడరంగులో కనిపించేలా ముదురువర్ణంతో వేసే ముగ్గులు ఇల్లంతా వెలుగులు నింపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్