ఆ బాధ్యతా మనదే!

పెరుగుతున్న కాలుష్యాన్ని చూసి భయపడతాం, భవిష్యత్తు తరాల గురించి ఆందోళన పడుతుంటాం. కానీ మనమేం చేస్తున్నామన్నది ఆలోచించారా? ఐకరాజ్య సమితి సహా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలెన్నింటికో రాయబారిని.

Published : 06 Nov 2022 00:53 IST

అనుభవ పాఠాలు

పెరుగుతున్న కాలుష్యాన్ని చూసి భయపడతాం, భవిష్యత్తు తరాల గురించి ఆందోళన పడుతుంటాం. కానీ మనమేం చేస్తున్నామన్నది ఆలోచించారా? ఐకరాజ్య సమితి సహా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలెన్నింటికో రాయబారిని. చెప్పడం కంటే ఆచరించి చూపించడం ద్వారానే ఎక్కువమంది అనుసరించేలా చేయగలమన్న సూత్రాన్ని నమ్ముతా. అందుకే నా పెళ్లి మాత్రమే కాదు.. దినచర్యలోనూ సస్టెయినబిలిటీని భాగం చేసుకున్నా. పెట్టుబడి పెట్టే సంస్థల విషయంలోనూ పర్యావరణ హితానికి ప్రాధాన్యమిచ్చేవే ఎంచుకుంటున్నా. మీరు కూడా ఏదైనా తక్కువ కొనండి. దాంతో వృథా తగ్గుతుంది. స్థానిక పంటలకు ప్రాధాన్యమివ్వండి. కొత్త ఫ్యాషన్‌ అని కాక ఉన్నవాటినే కొత్తగా ఎలా మలచుకోవచ్చో ఆలోచించండి. ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేయడం, ఎక్కడికెళ్లినా సొంతంగా చేతి సంచి, మెటల్‌ వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లడం లాంటివి చేస్తే భూమిపై కాలుష్యాన్ని తగ్గించిన వాళ్లవుతారు. ముందు మీరు మొదలుపెడితే ఇంట్లోవాళ్లు అలవాటుగా చేసుకుంటారు. భయపడుతూ కూర్చోవడం కాదు.. బాధ్యత తీసుకోవాలి. అది ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. ప్రయత్నం మొదలుపెట్టేయండి.

- దియా మిర్జా, నటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్