కాఫీ ప్రియులకు ప్రత్యేకం..

ఉదయం నిద్ర లేచిన వెంటనే పొగలుకక్కే కాఫీ తాగడాన్ని ఎంతో మంది ఇష్టపడతారు. అటువంటి కాఫీ ప్రియులకు ఇల్లంతా కప్పుల అలంకరణ కనిపిస్తే ఆ ఫీలింగ్‌ ఇంకా బాగుంటుంది కదా అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు. 

Published : 10 Nov 2022 00:07 IST

ఉదయం నిద్ర లేచిన వెంటనే పొగలుకక్కే కాఫీ తాగడాన్ని ఎంతో మంది ఇష్టపడతారు. అటువంటి కాఫీ ప్రియులకు ఇల్లంతా కప్పుల అలంకరణ కనిపిస్తే ఆ ఫీలింగ్‌ ఇంకా బాగుంటుంది కదా అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.

షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా అందమైన కప్పు చూస్తే మనసు పారేసుకుంటాం. అలా ఇంట్లో కాఫీ కప్పులు చేరిపోతుంటాయి. వాటిలో కొన్ని హ్యాండిల్‌ విరిగిపోవడం, డిజైన్‌ చెరగడం లేదా కలర్‌ పోవడంతో కప్పులు వృథాగా ఉంటాయి. వీటిని సైజులు, వర్ణాల బట్టి కప్పులను విడదీయాలి. పెద్ద కప్పులకు ముందుగా జిగురు రాసి వాటికి పురికొసను బిగుతుగా చుడుతూ చిన్న పువ్వు వచ్చేలా పూర్తిచేసి అంటించాలి. సాసర్‌కూ చుట్టి దానిపై కప్పును ఓవైపు జారినట్లుగా అతికించాలి. ఆ తర్వాత కొన్ని కాఫీ గింజలను కప్పు నుంచి సాసర్‌లోకి జారుతున్నట్లుగా అమర్చితే చాలు. కళాకృతిలా మారిపోతుంది. దీన్ని భోజనబల్ల లేదా టీపాయ్‌ మీద ఉంచితే గదికి కొత్త అందాన్ని తెస్తుంది.

బొమ్మగా: రీడింగ్‌ రూం లేదా కాఫీ తాగే బల్ల పక్కగా గోడపై పెద్ద కాఫీ జార్‌ దానికి కొంచెం కిందగా ఒక కప్పు బొమ్మలు గీయాలి. గోడ వర్ణానికి తగినట్లుగా ముదురు, లేత వర్ణాల కప్పులను ఎంచుకొని వాటిని జార్‌ బొమ్మ నుంచి కింది కప్పు బొమ్మ వరకు జారుతున్నట్లు సర్ది చిన్నచిన్న మేకులకు వేలాడదీస్తే చాలు.

ఫ్రేమ్‌లో: పాత ఫొటో ఫ్రేం ఉంటే అందులోనూ పాత కప్పు, సాసర్‌ను జిగురుతో అంటించాలి. వీటికి కొంచెం పైగా చిన్న చెంచాను ఫ్రేంలోనే వచ్చేలా అంటించి కాఫీ గింజలను చెంచా నుంచి కప్పు, సాసర్‌లో పడేలా అతికిస్తే చాలు. అందమైన ఫ్రేం, అందులో కాఫీగింజలతో కప్పు, సాసర్‌ అలంకరణ అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకెందుకాలస్యం.. మీరూ చేసి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్