ఊలు పూల అందాలు

చలికాలం వచ్చేటప్పటికి స్వెటర్లు అల్లుతుంటాం. మిగిలిన ఊలుతో చిన్నచిన్న పూలను అల్లి ఇంటి అలంకరణలో వాటిని ఉపయోగించుకోవచ్చు.

Published : 13 Nov 2022 00:08 IST

చలికాలం వచ్చేటప్పటికి స్వెటర్లు అల్లుతుంటాం. మిగిలిన ఊలుతో చిన్నచిన్న పూలను అల్లి ఇంటి అలంకరణలో వాటిని ఉపయోగించుకోవచ్చు.

రంగురంగుల ఊలు దారాలన్నింటినీ సేకరించాలి. వీటిని చిన్న చిన్న పూలలా అల్లుకోవాలి. ఈ పూలన్నింటినీ కలిపి ముందుగది, వరండా కిటికీలకు తోరణంలా కడితే చాలు. లేదా పైనుంచి సగం వరకు కర్టెన్‌గా వచ్చేలా పూలను కలిపి, రాడ్‌కు తగిలిస్తే ముచ్చటగా ఉంటుంది. కిటికీకి పల్చగా ఉండే పాలరంగు లేదా తెలుపు వర్ణం కర్టెన్‌ను ఎంచుకొని, దానిపై తోరణంలా ఈ పూలను కలిపి కుట్టాలి. చూడటానికి రెండు కర్టెన్లలా అనిపిస్తూ, వర్ణభరితమైన పూలపై బయటి వెలుతురు ప్రతిఫలిస్తుంటే గదికే ప్రత్యేకతను తెస్తాయి.

బల్లపై..  పూలన్నింటినీ ఒకదానిపక్క మరొకటి కలిపి కుట్టి మ్యాట్‌లా తయారు చేయాలి. ముదురు, లేత వర్ణాలను పక్కపక్కగా వచ్చేలా చూడాలి. ఈ మ్యాట్‌ను భోజనాల బల్ల, టీపాయి వంటి వాటిపై పరవాలి. దీనిపై చిన్న ఫ్లవర్‌ వాజ్‌, ఇండోర్‌ మొక్కను సర్దితే చాలు. అలాగే దిండ్ల కవర్లపై ఈ పూలన్నింటినీ కలిపి కుట్టినా బాగుంటాయి. సోఫా కవర్లకు జోడించినా కొత్త కళను తెస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్