బల్ల తోట భలే!

తోట లేదా మిద్దెతోటలో పెంచిన మొక్కలను చూస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అదే మనం రోజూ ఆఫీస్‌పని చేసే బల్ల లేదా భోజన బల్లపై చిన్న గార్డెన్‌లా మొక్కలను పెంచితే.. అవి ఆరోగ్యాన్ని అందించడమే కాదు, ఒత్తిడినీ దూరం చేస్తాయి. 

Published : 20 Nov 2022 00:57 IST

తోట లేదా మిద్దెతోటలో పెంచిన మొక్కలను చూస్తుంటే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అదే మనం రోజూ ఆఫీస్‌పని చేసే బల్ల లేదా భోజన బల్లపై చిన్న గార్డెన్‌లా మొక్కలను పెంచితే.. అవి ఆరోగ్యాన్ని అందించడమే కాదు, ఒత్తిడినీ దూరం చేస్తాయి. 

అందమైన గాజు, పింగాణీ పాత్రలను ఎంపిక చేసుకొని వాటిపై రెండు మూడు వర్ణాలు కలిపిన డిజైన్లు వేస్తే మరింత ఆకర్షణగా కనిపిస్తాయి. ఆ తర్వాత వాటిలో వేయడానికి కంకర, బొగ్గు, సేంద్రియ ఎరువు కలిపిన నల్ల లేదా ఎర్రమట్టి సిద్ధం చేసుకోవాలి. కొంచెం కోకోపీట్‌ ఉంటే మంచిది. ప్రతి గాజు బౌల్‌లో అడుగున కొన్ని బొగ్గుముక్కలు వేయాలి. వాటిపై రెండేసి చెంచాల కంకర సర్ది దానిపై కోకోపిట్‌, మట్టి వేసి పాత్రను మూడొంతులు నింపాలి. బౌల్‌ని బట్టి మనీప్లాంట్‌, కలబంద వంటి ఇండోర్‌ ప్లాంట్స్‌ను మట్టి లోపలకు ఉండేలా నాటాలి. తిరిగి మట్టిపై వచ్చేలా రెండుమూడు బొగ్గు ముక్కలు, కంకరను సర్దాలి. మట్టి తడిసేలా మాత్రమే నీళ్లు పోస్తే సరిపోతుంది. రెండు రోజులకొకసారి వీటికి నీటిని స్ప్రే చేస్తుండాలి. బల్లపై పచ్చదనాన్ని నింపుతూ గదికీ ఆకర్షణను తెస్తాయి.

పూలతో.. ఆకుల పచ్చదనమే కాకుండా పూలు విరిసే మొక్కలను బల్లపై పెంచితే ఆ అందమే వేరు. అలా పెట్యూనియా మొక్క టేబుల్‌టాప్‌ గార్డెన్‌లో చూడముచ్చటగా ఉంటుంది. వెడల్పైన, విశాలంగా ఉండే బౌల్‌ అయితే మొక్క బాగా పెరుగుతుంది. ఇది తీగజాతి మొక్క కావడంతో బౌల్‌లోపలే వచ్చేలా.. చిన్న ఆర్చ్‌ను జత చేయాల్సి ఉంటుంది. మొక్క బాగా చిగుర్లు వేసి ముదురు గులాబీ వర్ణం పూలను పూస్తుంది. రోజూ కొంచెంగా నీటిని అందించాలి. వెలుతురు ఎక్కువగా అవసరమవడంతో ఎండ పడేచోట లేదా నిత్యం లైట్‌ పడేలా దీన్ని ఉంచితే చాలు. ఆరోగ్యంగా పెరిగి పూలు పూస్తుంది. దీనికి ఎర్రమట్టి అవసరం. ఈ మొక్క మొదళ్లలో నచ్చిన థీంనీ ఏర్పాటు చేసుకోవచ్చు, ఏవైనా చిన్న విగ్రహాలనో, బొమ్మలనో, చిన్న ఊయల, కంకర రాళ్లు వంటివో మొక్క పక్కగా సర్దితే చాలు. అందంగా కనిపిస్తూ.. ప్రశాంతతనూ అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్