గడువు దాటితే... వాడొద్దు

ఆహారపదార్థాలకూ, మందులకూ, సౌందర్య ఉత్పత్తులకూ గడువుతేదీ ఉన్నట్లే... మనం నిత్యం వాడే మరికొన్ని వస్తువులకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఆ తర్వాతా వాడితే... తెలియకుండానే అనారోగ్యాల బారిన పడతాం.

Updated : 24 Nov 2022 01:05 IST

ఆహారపదార్థాలకూ, మందులకూ, సౌందర్య ఉత్పత్తులకూ గడువుతేదీ ఉన్నట్లే... మనం నిత్యం వాడే మరికొన్ని వస్తువులకూ ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఆ తర్వాతా వాడితే... తెలియకుండానే అనారోగ్యాల బారిన పడతాం. అవేంటంటే...

లో దుస్తులు: చాలామంది చేసే పొరపాటు ఇదే. వీటిని ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. నిత్యం ఒంటిని అతుక్కుని ఉండే వీటికి చెమట వల్ల బ్యాక్టీరియా ముప్పు ఎక్కువే. అలర్జీలు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లూ వచ్చే ప్రమాదం ఉంది. తరచూ వాడటం వల్ల ఇవి ఆకృతిని కోల్పోతాయి. అయినా ధరిస్తే వెన్ను నొప్పి, ఇతరత్రా సమస్యలూ ఎదురుకావొచ్చు. ఏడాదికి మించి వీటిని వాడకపోవడమే మేలు.

వంటింటి న్యాప్‌కిన్లూ: న్యాప్‌కిన్లను ఏ రోజుకారోజు ఉతకడం మేలు. వంట తాలూకు వ్యర్థాలతో పాటూ, నూనె, జిడ్డు, ఇతరత్రా ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివన్నీ దీన్లో చేరిపోతాయి. అందుకే ఉతికేటప్పుడు కాస్త బేకింగ్‌ సోడా కూడా వేయాలి. ప్రతి మూడు నెలలకోసారైనా వీటిని మార్చేయాలి.


బ్రష్‌లు: రెండు మూడేళ్ల నుంచి ఒకటే బ్రష్‌ వాడేస్తున్నారా? ఏళ్లు కాదు... ఆరేడు నెలలకే దాన్ని మార్చేయాలి. నిజానికి ఈ విషయంలోనే ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తారు కూడా. ఒకవేళ ఆ సమయం కంటే ముందుగానే రంగు మారినా, వంకరపోయినా, కుచ్చులు ఊడిపోతున్నా, బిరుసెక్కినా... వెంటనే పడేయండి. లేదంటే అది శుభ్రం చేసే మాట అటుంచి, హానికరంగా మారుతుంది.


దువ్వెనలు: వీటిని రెండు రోజులకోసారైనా శుభ్రం చేయాలి. వేడినీళ్లలో బేకింగ్‌ సోడా వేసి దువ్వెనల్ని కాసేపు నానబెట్టి కడగాలి. ఏడాదికి మించి వాడద్దు.


తలగడ: ఇది లేకపోతే నిద్రపట్టదు చాలామందికి. ఒకే దిండుని ఏళ్ల తరబడి వాడితే మాత్రం మెడనొప్పి ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు మనకంటికి కనిపించని బ్యాక్టీరియా ముఖంపైకి చేరి శ్వాస సమస్యలతో పాటు... అలర్జీలూ వస్తాయి. అందుకే రెండేళ్లకోసారైనా వీటిని మార్చాల్సిందే.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్